నేడు అందరి దృష్టి ఫోగాట్‌ పైనే.. నేటి భారత్ షెడ్యూల్ ఇదే..

ప్రస్తుతం జరుగుతున్న పారిస్ ఒలింపిక్స్ 2024 ( Paris Olympics 2024 )సంబరం 12 వ రోజుకు చేరుకుంది.ఇకపోతే మంగళవారం నాడు మహిళల రెజ్లింగ్‌లో వినేష్ ఫోగాట్ ఫైనల్ కు చేరింది.

 Today Everyone's Focus Is On Phogat And This Is India's Schedule, Olympic Games,-TeluguStop.com

ఈ నేపథ్యంలో భారతీయులు వినేష్ ఫోగాట్ స్వర్ణం గెలవాలని అశిస్తున్నారు.ఇప్పటివరకు ఒలింపిక్ చరిత్రలో రెజ్లింగ్ ఈవెంట్‌లో ఫైనల్‌ కు చేరిన మొదటి భారతీయ మహిళగా వినేష్ ఫోగట్( Vinesh Phogat ) చరిత్ర సృష్టించింది.

ఐకమరోవైపు మరో భారత ప్రముఖ భారత రెజ్లర్ అంతిమ్ పంఘాల్ కూడా ఫ్రీక్వార్టర్ ఫైనల్లో జైనెప్ యెట్గిల్ తో అమితుమీ తేల్చుకోనుంది.ఇకపోతే నేడు ఆ ఈవెంట్ ఉన్నాయో ఒకసారి చూస్తే.

Telugu Olympic Games, Parisolympic, Phogatindias, Vineesh Phogat-Latest News - T

మధ్యాహ్నం 1.35 గంటలకు పురుషుల హైజంప్ (క్వాలిఫికేషన్)లో సర్వేష్ కుషారే పోటీ పడనున్నాడు.మధ్యాహ్నం 1.45 గంటలకు మహిళల 100 మీటర్ల హర్డిల్స్ (రౌండ్ 1) జ్యోతి యర్రాజీ (హీట్ 4) లో పోటీ పడనుంది.మధ్యాహ్నం 1.55 గంటలకు మహిళల జావెలిన్ ( Javelin )త్రో (క్వాలిఫికేషన్)లో అన్ను రాణి తన లక్ ను పరీక్షించుకోనుంది.రాత్రి 10.45 గంటలకు పురుషుల ట్రిపుల్ జంప్ (క్వాలిఫికేషన్) , అర్ధరాత్రి 1.13 గంటలకు (ఆగస్టు 8, గురువారం) నాడు పురుషుల 3,000 మీటర్ల స్టీపుల్ ఛేజ్ (ఫైనల్)లో అవినాష్ సాబ్లే పాల్గొననున్నాడు.

Telugu Olympic Games, Parisolympic, Phogatindias, Vineesh Phogat-Latest News - T

మధ్యాహ్నం 12.30 గంటలకు మహిళల వ్యక్తిగత (రౌండ్ 1)లో అదితి అశోక్, దీక్షా డాగర్( Aditi Ashok, Deeksha Dagar ) పాల్గొననున్నారు.మధ్యాహ్నం 1.30 గంటలకు టేబుల్ టెన్నిస్ మహిళల జట్టు (క్వార్టర్ ఫైనల్)లో జర్మనీ vs భారత్ (శ్రీజా ఆకుల, మనికా బాత్రా, అర్చన గిరీష్ కామత్) తలపడనున్నాయి.మధ్యాహ్నం 3.05 గంటలకు రెజ్లింగ్ మహిళల ఫ్రీస్టైల్ 53 కేజీలులో అంతిమ్ పంగల్ ఆడనున్నాడు.రాత్రి 11.00 గంటలకు వెయిట్ లిఫ్టింగ్ మహిళల 49 కేజీల (మెడల్ రౌండ్) లో సైఖోమ్ మీరాబాయి చాను పోరాడనుంది.రాత్రి 11.23 గంటలకు మహిళల ఫ్రీస్టైల్ 50 కేజీలు (గోల్డ్ మెడల్ మ్యాచ్) లో వినేశ్ ఫోగట్ vs సారా హిల్డెబ్రాండ్ తలపడనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube