తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు రాజ్ తరుణ్ ( Raj Tarun )ప్రస్తుతం ఆయన ‘తిరగబడరా సామి( Thiragabadara Saami )’ అనే సినిమా చేస్తున్నాడు.ఇక సినిమాల పరంగా ప్రస్తుతం ఆయన చాలావరకు ప్లాప్ లో ఉన్నప్పటికీ పర్సనల్ విషయాల్లో మాత్రం ఎప్పుడు మీడియా ముందు ఉంటున్నాడు.
ఇక రీసెంట్ గా ఆయన మాజీ ప్రేయసి ఆయన లావణ్య రాజ్ తరుణ్ తనని మోసం చేశారంటూ కేసు పెట్టిన విషయం మనకు తెలిసిందే.ఇక ఇవాళ్ళ ఆమె మీడియా ముందుకు వచ్చి రాజ్ తరుణ్ నన్ను మోసం చేశాడు.రెండుసార్లు నాకు అబార్షన్ కూడా చేయించాడు.10 సంవత్సరాల నుంచి మేము కలిసి ఉంటున్నాం.
నన్ను పెళ్లి కూడా చేసుకున్నాడు అంటూ చాలా ఘాటు వ్యాఖ్యలు చేసింది.ఇక రాజ్ తరుణ్( Raj Tarun) ఈ విషయం మీద నాకు సమాధానం చెప్పేంత వరకు నేను ఆయన్ని వదిలిపెట్టను అంటూ మీడియా ముందు చాలా వైల్డ్ గా రియాక్ట్ అయింది… ఇక ఈ విషయం మీద తిరగబడరా సామి మూవీ క్యూ అండ్ ఏ శేషన్ లో పాల్గొన్న రాజ్ తరుణ్ కూడా లావణ్య మాట్లాడిన మాటలను రియాక్ట్ అవుతూ మీడియా ముందుకు వచ్చి అరుచుకుంటూ మాటలు మాట్లాడినంత మాత్రాన అబద్ధాలు నిజం అయిపోవు.ఆమె మీద నేను లీగల్ గా ఫైట్ చేస్తున్నాను./br>
ఆమె చెప్పినవన్నీ అబద్ధాలను ప్రూవ్ చేయడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ ఆయన ఎమోషనల్ గా మాట్లాడాడు…ఇక మొత్తానికైతే ఈ గొడవ ద్వారా రాజ్ తరుణ్ తరచుగా న్యూస్ లో ఉంటున్నాడు.ఇక రీసెంట్ గా ఆయన హీరోగా వచ్చిన ‘పురుషోత్తముడు ‘ సినిమా( Purushothamudu ) ప్లాప్ అయింది.మరి తిరగబడరా సామి సినిమా విషయంలో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…
.