ఉద్రిక్తతల వేళ ఎస్ఎఫ్‌జే దూకుడు.. కెనడాలో ఖలిస్తాన్‌పై ప్రజాభిప్రాయ సేకరణ

సిక్కులకు ప్రత్యేక దేశం ‘ఖలిస్తాన్( Khalistan ) కావాలంటూ విదేశాల్లో ఉద్ధృతంగా ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి.ముఖ్యంగా కెనడా ఈ నిరసనలకు కేంద్రంగా మారుతోంది.

 Over 55000 Vote For Khalistan Referendum In Canada , Khalistan, Khalistan Refer-TeluguStop.com

ఇక్కడ పెద్ద సంఖ్యలో స్థిరపడిన సిక్కుల్లోని కొన్ని వర్గాలు.ఖలిస్తాన్ వేర్పాటువాదులకు అన్ని రకాలుగా అండదండలు అందిస్తున్నారు.

దీనికి తోడు కెనడాలోని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం( Justin Trudeau ) సైతం వెన్నుదన్నుగా నిలుస్తుండటంతో ఖలిస్తాన్ సానుభూతిపరులు రెచ్చిపోతున్నారు.ఆ దేశంలోని సిక్కేతర మతస్తులను, ముఖ్యంగా హిందువులను వారు టార్గెట్ చేస్తున్నారు.

పలు దేవాలయాలను ధ్వంసం చేయడంతో పాటు ఆలయాలపై పిచ్చి రాతలు రాస్తున్నారు.ఈ ఉన్మాదులను నియంత్రించాలని భారత ప్రభుత్వం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కెనడా సర్కార్ పట్టించుకున్న దాఖలాలు లేవు.

Telugu Abbotsd, Air India, Canada, Colombia, Justin Trudeau, Khalistan, Toronto-

పలు వేర్పాటువాద సంస్థలు అడపాదడపా ఖలిస్తాన్‌పై ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) నిర్వహిస్తూ రెచ్చగొడుతున్నాయి.తాజాగా సిఖ్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే) గత ఆదివారం అల్బెర్టా ప్రావిన్స్‌లోని కాల్గరీలో రెఫరెండం నిర్వహించింది.దాదాపు 55 వేల మంది ఈ ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొని తన అభిప్రాయం తెలియజేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే గ్రేటర్ టొరంటో ఏరియాలోని బ్రాంప్టన్‌లో రెండు సార్లు.బ్రిటీష్ కొలంబియా( Colombia)లోని సర్రేలో ఒకసారి, తాజాగా ఇప్పుడు కాల్గరీలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది.2025 వేసవిలో క్యూబెక్‌లోని మాంట్రియల్ నగరంలో మరో రౌండ్ రెఫరెండం నిర్వహించాలని వేర్పాటువాద సంస్థలు ప్రణాళికలు రచిస్తున్నాయి.అలాగే జీటీఏ, ఎడ్మంటన్.బ్రిటీష్ కొలంబియాలోని అబోట్స్‌ఫోర్డ్‌లలోనూ ప్రజాభిప్రాయ సేకరణలు నిర్వహించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Telugu Abbotsd, Air India, Canada, Colombia, Justin Trudeau, Khalistan, Toronto-

అయితే ఎస్ఎఫ్‌జే తన ప్రజాభిప్రాయ కార్యక్రమాలలో రెచ్చగొట్టే చర్యలకు దిగుతోంది.కాల్గరీలో ఏర్పాటు చేసిన పోస్టర్‌లో జూన్ 23, 1985న ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182పై బాంబు దాడికి సూత్రధారిని, 329 మంది ప్రాణాలు కోల్పోయిన కనిష్క చిత్రాన్ని ప్రదర్శించారు.కెనడా చరిత్రలోనే ఇది అత్యత దారుణమైన ఉగ్రవాద ఘటనగా మిగిలిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube