మనం ఏ విషయంలోనైనా భయభ్రాంతులకు లోనైనా.లేకపోతే ఏ తగాదాలకు విషయం సంబంధించి అయినా.
చివరికి పరిష్కారం కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్లడం మామూలే.ఇకపోతే చాలామంది పోలీసులు వారి నిజాయితీ, నిబద్ధతతో పనులు చేస్తూ పోలీసులకు మంచి పేరు తీసుకువస్తుంటే మరి కొందరు మాత్రం పబ్లిక్ గానే సామాన్యులపై కోరడజలుమించడం చూస్తూ ఉంటాము.
ఇలాంటి ఘటనకు సంబంధించి సోషల్ మీడియా( Social media )లో ఇప్పటికే అనేక వీడియోలు చూసే ఉంటాము.తాజాగా ఇలాంటి ఓ ఘటన సంబంధించిన వీడియో నెట్టింట చక్కరలు కొడుతోంది.
ఈ వైరల్ వీడియోకి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్( Nagarkurnool ) జిల్లా కేంద్రానికి చెందిన మిడిదొడ్డి రంజిత్ అనే వ్యక్తి ఇంటికి వెళ్తున్న సమయంలో శాన్వి హాస్పిటల్ సమీపంలోని తన ఇంటి వైపు వెళ్లే క్రమంలో.పానగల్ మండలం ఎస్సై కళ్యాణ్ రావ్ హౌసింగ్ బోర్డ్ ప్రాంతం నుండి TS 31D 4445 నెంబర్ ఉన్న హోండా అమేజ్ కారు లో వెళ్తున్నాడు.అయితే వీరిద్దరూ ఒకే ప్రాంతంలో యూటర్న్ తీసుకుంటున్నగా ఒకరికి ఒకరు ఎదురుపడ్డారు.
అయితే ఈ సమయంలో తన కారుకి రంజిత్ బైకుని అడ్డంగా నిలపాడని భావించిన ఎస్సై అతనితో వాదనకు దిగాడు.అయితే వారిద్దరి మధ్య మాటలు పెరగడంతో కోపద్రికుడైన ఎస్సై ఒక్కసారిగా కారులో నుంచి బయటికి వచ్చి బైక్ పై ఉన్న రంజిత్ వ్యక్తి మీద దాడి చేశాడు.
తన కారుకు ఎదురుగా వచ్చాడన్న కోపంతోనే ఆపై దాడి చేసి బూట్ కాళ్లతో ఎస్సై కొట్టినట్లు సమాచారం.అంతేకాదు., నడి రోడ్డుపై రంజిత్ ను ఎస్ఐ కింద పడేసి పిడుగులు కూడా కురిపించినట్లు వీడియోలో స్పష్టంగా కనబడుతోంది.ఆ సంఘటన తర్వాత రంజిత్(Ranjit ) ను స్థానిక పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి మరోసారి అక్కడ కూడా దాడి జరిపినట్లు బాధితుడు తెలియజేశాడు.
ఈ ఘటన జరిగిన సమయంలో రోడ్డు పక్కనే ఉన్న ఓ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.చూడాలి మరి సదరు ఎస్సై పై పోలీస్ బాసులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో.