మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో ఉన్న నానాజీ దేశ్‌ముఖ్ వెటర్నరీ యూనివర్సిటీలో ( Nanaji Deshmukh Veterinary University )చదువుకునేందుకు ఆసక్తి చూపుతున్న విదేశీ విద్యార్ధులకు శుభవార్త.ఈ వర్సిటీ కొత్తగా ఎన్ఆర్ఐ కోటాను ప్రవేశపెట్టింది.
అంతర్జాతీయ విద్యార్ధులకు ఈ సంస్థ నేరుగా ప్రవేశాలను అనుమతిస్తుంది.విదేశీ విద్యార్ధులకు భారతదేశంలో వెటర్నరీ సైన్స్‌లో విద్యను అభ్యసించడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశంగా నిపుణులు చెబుతున్నారు.
ఈ మేరకు యూనివర్సిటీ అకడమిక్ కౌన్సిల్ ఈ కొత్త ప్రక్రియను ఆమోదించింది.
సింగిల్ విండో సిస్టమ్( Single window system ) ద్వారా దీనిని అమలు చేయనున్నారు.అంటే విద్యార్ధులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు.యూనివర్సిటీ పరిధిలోని మూడు ప్రభుత్వ వెటర్నరీ కాలేజీలకు సైతం ఎన్ఆర్ఐ కోటా వర్తిస్తుంది.
బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ , బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్( Bachelor of Veterinary Science, Bachelor of Fisheries Science ) కోర్సుల్లో ఎన్ఆర్ఐ, విదేశీ విద్యార్ధుల కోసం ప్రత్యేకంగా 34 సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి.ఈ సీట్లన్నీ ప్రభుత్వ వెటర్నరీ కాలేజీల్లోనే ఉన్నాయి.
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్ట్ 31.ఆసక్తి ఉన్న విద్యార్ధులు ఈ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాలి.ఈ సీట్లు జబల్పూర్లోని వెటర్నరీ కాలేజీ, మహూలోని వెటర్నరీ సైన్స్, యానిమల్ హజ్బెండరీ కాలేజీ, రేవా కాలేజీలలో అందుబాటులో ఉన్నాయి.
నానాజీ దేశ్‌ముఖ్ వెటర్నరీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ శ్రీకాంత్ జోషి( Dr.Srikanth Joshi ) మాట్లాడుతూ.సింగిల్ విండో విధానంలో దరఖాస్తు ప్రక్రియను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ వ్యవస్థ విద్యార్ధులకు అడ్మిషన్ల విషయంలో గందరగోళాన్ని నివారించడానికి రూపొందించినట్లు చెప్పారు.ఎన్ఆర్ఐ , విదేశీ కోటా సీట్లను చేర్చాలని అకడమిక్ కౌన్సిల్ నిర్ణయించిందని డాక్టర్ జోషి పేర్కొన్నారు.
ఎక్కువ మంది విదేశీ విద్యార్ధులను విశ్వవిద్యాలయం వైపు ఆకర్షించడం, విద్యా వాతావరణాన్ని సుంపన్నం చేయడం , సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించడం ఈ నిర్ణయం తీసుకున్నారు.వర్సిటీ నిర్ణయంపై ఎన్ఆర్ఐ, విదేశీ విద్యార్ధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.