జాకీచాన్-ప్రభాస్, బన్నీ-చెర్రీ లాంటి మల్టీస్టారర్స్‌ ప్లాన్ చేశారు.. కానీ..??

సాధారణంగా మల్టీస్టారర్ మూవీలకు యమ క్రేజ్ ఉంటుంది.ఎందుకంటే ఇలాంటి సినిమాల్లో ఇద్దరు బడా హీరోలు కలిసి పనిచేస్తారు.

 Big Multistarr Movies Missed , Jackie Chan-prabhas , Big Multistarr Movies, Allu-TeluguStop.com

వారిద్దరూ స్క్రీన్‌పై కనిపిస్తే ఫ్యాన్సు థియేటర్లు దద్దరిల్లేలా చేస్తారు.ఉదాహరణకి పఠాన్ సినిమాలో షారుఖ్, సల్మాన్ కలిసి కొంతసేపే కనిపించారు కానీ ఆ కొంతసేపు కూడా ప్రేక్షకుల్లో చెప్పలేనంత యుఫోరియా క్రియేట్ అయింది.

ఇలాంటి పెద్ద స్టార్లు కలిసి వెండితెరపై మెరిస్తే ఆడియన్స్‌కు కలిగే అనుభూతి వేరు.వీరి మధ్య మంచి యాక్షన్ సన్నివేశాలు పెడితే ఇంకా అదిరిపోతుంది.

నిజానికి తెలుగు ఆడియన్స్‌ను అలరించడానికి ఇలాంటి సెన్సేషనల్ మల్టీస్టారర్ మూవీస్ ప్లాన్ చేయడం జరిగింది.కానీ దురదృష్టవశాత్తు వాటిలో కొన్ని స్టార్ట్ కాకుండానే ఆగిపోయాయి.

మరికొన్ని మధ్యలోనే నిలిచిపోయాయి.కొన్ని ప్రారంభమవుతాయో లేదో కూడా చెప్పలేని పరిస్థితి.అలాంటి వాటిలో మూడు సినిమాలు గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

• జాకీచాన్-ప్రభాస్

( Jackie Chan-Prabhas )

హాంకాంగ్ మార్షల్ ఆర్టిస్ట్, యాక్టర్ జాకీచాన్ గురించి తెలియని వాళ్లు ఉండరు.ఈ నటుడు ఒక మల్టీ-టాలెంటెడ్ పర్సన్.కొన్ని సినిమాలు డైరెక్ట్ కూడా చేశాడు.స్టంట్‌మ్యాన్‌గానూ పనిచేశాడు.60 ఏళ్ల కెరీర్‌లో 150కి పైగా చిత్రాలలో నటించి గ్లోబల్ ఐకాన్ అయ్యాడు.రష్ అవర్, షాంఘై నూన్‌ వంటి సినిమాలతో ఇండియాలోనూ పాపులర్ అయ్యాడు అయితే ఇంతటి బడా యాక్టర్ ప్రభాస్‌కు ఫ్యాన్ అయిపోయాడు.మిర్చి సినిమాలోని యంగ్ రెబల్ స్టార్ యాక్టింగ్ చూసి అతడిని తన సినిమాలో నటింపజేయాలని కోరుకున్నాడు.

కానీ ప్రభాస్ అప్పటికే రాజమౌళితో కలిసి బాహుబలి మూవీని ప్రారంభించాడు.ఆ కారణంగా జాకీచాన్‌తో నటించలేకపోయాడు.లేదంటే వీరిద్దరి కాంబోలో ఒక యాక్షన్-ఓరియంటెడ్ గ్లోబల్ మూవీ వచ్చి ఉండేది.

Telugu Alluarjun, Big Multir, Bollywood, Jackiechan, Johnnydepp, Tollywood-Telug

• అల్లు అర్జున్ – రామ్ చరణ్

( Allu Arjun – Ram Charan )

పుష్ప సినిమా తర్వాత బన్నీ ఎవరూ చేరుకోలేని స్థాయికి చేరుకున్నాడు.మరోవైపు ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ కూడా ఇంచుమించు బన్నీతో సమానమైన స్టార్డమ్‌ తెచ్చుకున్నాడు.అయితే వీరిద్దరి కాంబోలో ఒక మల్టీస్టారర్ మూవీ ప్లాన్ చేసినట్లు తెలిసింది.

కానీ ఇప్పటివరకు ఆ సినిమా పట్టాలెక్కలేదు.ఒకవేళ వీరిద్దరి కాంబోలో సినిమా వస్తే అది కచ్చితంగా భారత చలనచిత్ర రంగంలోని అన్ని రికార్డులను బద్దలు కొడుతుంది.

Telugu Alluarjun, Big Multir, Bollywood, Jackiechan, Johnnydepp, Tollywood-Telug

• జానీ డెప్ – అమితాబ్ బచ్చన్

( Johnny Depp – Amitabh Bachchan )

ప్రముఖ అమెరికన్ యాక్టర్ జానీ డెప్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు.పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్‌లో ( Pirates of the Caribbean )కెప్టెన్ జాక్ స్పారోగా నటించి ఈ నటుడు ప్రపంచవ్యాప్తంగా సూపర్ పాపులర్ అయ్యాడు.అయితే ఈ హీరో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి 2011లోనే ఒక ఇండియన్ సినిమా చేయాల్సి ఉంది కానీ జానీ డెప్ ఇండియాకి వచ్చి షూటింగ్ చేయడానికి భయపడ్డాడు.అందువల్ల ఈ మూవీ క్యాన్సిల్ అయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube