కస్తూర్బాగాంధీ పాఠశాలలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు

సూర్యాపేట జిల్లా: జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు గరిడేపల్లి ఎస్ఐ ఈట సైదులు అధ్వర్యంలో సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ పాఠశాల/కళాశాలలో సైబర్ నేరాలపైన పోలీసు కళాభృందంతో విద్యార్థినిలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా గరిడేపల్లి ఎస్ఐ సైదులు మాట్లాడుతూ జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు సైబర్ నేరాలపై పటిష్టంగా పనిచేస్తున్నామని, ప్రతి స్కూల్ లో చదువుకునే విద్యార్థులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలని, సైబర్ మోసగాళ్ళ వలలో పడి మోసాలకు గురి కావద్దని, బ్యాంక్ ఖాతా,ఏటిఎం కార్డ్ ఓటిపి వివరాలు ఇతరులకు తెలపవద్దని సూచించారు.

 Cyber ​​crime Awareness Seminar At Kasturba Gandhi School, Cyber ​​crime-TeluguStop.com

ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావద్దని, మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దని తెలిపారు.సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని,అలాగే వేధింపులపై 100 కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

వ్యక్తిగత సమాచారం,బ్యాంకు వివరాలు,ఏటీఎం పిన్ నెంబర్లు,సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు.వ్యక్తిగత ఫోటోలను డిపిలుగా పెట్టుకోవద్దని చెప్పారు.

మొబైల్ యాప్ లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చెయ్యొద్దని,యువత చెడు వ్యసనాల బారిన పడొద్దన్నారు.డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడపవద్దని,ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించొద్దని అన్నారు.

యువత లోన్ యాప్ లకు దూరంగా ఉండాలన్నారు.సామాజిక మాధ్యమాలకు రక్షణగా బలమైన పాస్వర్డ్లు పెట్టుకోవాలని సూచించారు.

అనంతరం పోలీసు కళా బృందం సాంస్కృతిక కార్యక్రమాలు,ఆటపాటలతో విద్యార్థినిలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ఎస్ఓ శైలజా,పోలీస్ సిబ్బంది కానిస్టేబుల్ శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, హోంగార్డ్ సత్తయ్య,కళాబృందం ఇంచార్జ్ యల్లయ్య,గోపి,గురులింగం,క్రిష్ణ,చారి,నాగర్జున విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube