తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు వాళ్ళకంటు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకోవాలనే క్రమంలో ముందుకు దూసుకెళ్తున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే దర్శకుడు సందీప్ రెడ్డివంగా కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కోరుకుంటున్నాడు.
ఇక ఇప్పటికే ఆయన బోల్డ్ కంటెంట్ తో సినిమాలు తీస్తాడు అనే ఒక ఇమేజ్ అయితే ఉంది.ఇక దానికి తగ్గట్టుగానే ఆయన సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో భారీ సక్సెస్ లను సాధిస్తూ ఉంటాయి.
అయితే సందీప్ రెడ్డివంగా( Sandeep Reddy Vanga ) పైన తరచుగా చాలామంది విమర్శలు చేయడం అనేది సరైన విషయం కాదు.నిజానికి ఆయన చేసిన సినిమాల్లో బోల్డ్ కంటెంట్ ఉన్నప్పటికీ ప్రేక్షకుల్ని విపరీతంగా అలరిస్తున్నాయి.
అలాగే మేకింగ్ పరంగా కూడా ఆయన చాలా కొత్త పద్ధతులను అనుసరిస్తూ సినిమాని చేస్తున్నాడు.దానివల్ల సినిమా చూసే ప్రేక్షకులకు అది చాలా కొత్తగా అనిపించడమే కాకుండా మూస ధోరణిలో చేసే సినిమాలకి ఇది కొంచెం భిన్నంగా ఉండడంతో ఈయన సినిమాలకు మంచి ఆదరణ దక్కుతుంది.అయితే బాలీవుడ్ లో కానీ టాలీవుడ్ లో కానీ ఈయన సినిమాల మీద కొంచెం వ్యతిరేకత అయితే వస్తూ ఉంటుంది.ఇక మొత్తానికైతే ప్రస్తుతం ఆయన స్పిరిట్ సినిమాతో అందరికీ సమాధానం చెప్పబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి.
ఇక స్పిరిట్ సినిమాలో ప్రభాస్( Prabhas ) ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నడట… మరి ఈ సినిమా కోసం అటు సందీప్ రెడ్డి వంగా కానీ, ఇటు ప్రభాస్ కానీ భారీ ఎత్తున శ్రమిస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే తనను ఎవరైతే హేళన చేసారో వాళ్ళందరికీ గుణపాఠం చెబుతూ ఈ సినిమాని చాలా అద్భుతంగా తరికెక్కించ బోతున్నారట.ఇక ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తారనేది కూడా తెలియాల్సి ఉంది…
.