ఆస్ట్రేలియా: జలపాతం వద్దకు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి..?

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో( Queensland, Australia ) తీవ్ర విషాదం చోటుచేసుకుంది.మిల్లా మిల్లా జలపాతంలో మునిగి ఇద్దరు తెలుగు విద్యార్థులు మరణించారు.

 Two Telugu Students Who Went To Australia Falls Died, Andhra Pradesh, Swimming,-TeluguStop.com

ఈ ఘటనలో బాపట్ల జిల్లాకు చెందిన చైతన్య ముప్పరాజు, ప్రకాశం జిల్లాకు చెందిన సూర్య తేజ బొబ్బ మృతి చెందారు. చైతన్య ముప్పరాజు, సూర్య తేజ బొబ్బ( Chaitanya Mupparaju, Surya Teja Bobba ) ఇద్దరూ ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు.

మంగళవారం, వారు జలపాతాన్ని సందర్శించారు.స్నానం చేస్తున్నప్పుడు, సూర్యతేజ ప్రమాదవశాత్తూ జలపాతంలోకి జారిపడ్డాడు.

ఈ దృశ్యం చూసి షాక్ అయిన చైతన్య వెంటనే రక్షించడానికి ఇంట్లోకి దిగాడు.అతడిని బయటికి లాక్కొద్దామని చూశాడు కానీ ఈ క్రమంలో ఇద్దరూ మునిగిపోయారు.

Telugu Andhra Pradesh, Bapatla, Millaa Millaa, Prakasam, Queensland-Telugu NRI

ఎమర్జెన్సీ సర్వీసు అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ, వారిని రక్షించలేకపోయారు.ఈ విషాద ఘటన భారతీయ సమాజాన్ని కలచివేసింది.మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.ఇన్‌స్పెక్టర్ జాసన్ స్మిత్ ( Inspector Jason Smith )ప్రకారం, ఇద్దరు స్నేహితులు ఒడ్డు నుంచి నీటిలోకి దిగారు.

ఒక విద్యార్థి నీటిలో చిక్కుకుపోగా మరొక విద్యార్థి ఆదుకోవడానికి ప్రయత్నించాడు.దురదృష్టవశాత్తు, ఈ ప్రయత్నంలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.ఈ విషాద ఘటనను చూసిన మరొక స్నేహితుడు నేరుగా సహాయం చేయలేకపోయానని చెప్పాడు.

Telugu Andhra Pradesh, Bapatla, Millaa Millaa, Prakasam, Queensland-Telugu NRI

క్విన్స్‌లాండ్ పోలీసులు, హెలికాప్టర్లు, అంబులెన్స్ టీంలతో సహా విస్తృత శోధనలు చేసినప్పటికీ, విద్యార్థులను వెంటనే కనుగొనలేకపోయారు.ఈ ఘటన తర్వాత, ప్రశాంతమైన ఆ జలపాతాన్ని తాత్కాలికంగా క్లోజ్ చేశారు.సెర్చ్ ఆపరేషన్స్‌ ముగిసిన తర్వాత ఆ ప్రాంతాన్ని మళ్లీ ఓపెన్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube