ఆస్ట్రేలియా: జలపాతం వద్దకు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి..?

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో( Queensland, Australia ) తీవ్ర విషాదం చోటుచేసుకుంది.మిల్లా మిల్లా జలపాతంలో మునిగి ఇద్దరు తెలుగు విద్యార్థులు మరణించారు.

ఈ ఘటనలో బాపట్ల జిల్లాకు చెందిన చైతన్య ముప్పరాజు, ప్రకాశం జిల్లాకు చెందిన సూర్య తేజ బొబ్బ మృతి చెందారు.

చైతన్య ముప్పరాజు, సూర్య తేజ బొబ్బ( Chaitanya Mupparaju, Surya Teja Bobba ) ఇద్దరూ ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు.

మంగళవారం, వారు జలపాతాన్ని సందర్శించారు.స్నానం చేస్తున్నప్పుడు, సూర్యతేజ ప్రమాదవశాత్తూ జలపాతంలోకి జారిపడ్డాడు.

ఈ దృశ్యం చూసి షాక్ అయిన చైతన్య వెంటనే రక్షించడానికి ఇంట్లోకి దిగాడు.

అతడిని బయటికి లాక్కొద్దామని చూశాడు కానీ ఈ క్రమంలో ఇద్దరూ మునిగిపోయారు. """/" / ఎమర్జెన్సీ సర్వీసు అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ, వారిని రక్షించలేకపోయారు.

ఈ విషాద ఘటన భారతీయ సమాజాన్ని కలచివేసింది.మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

ఇన్‌స్పెక్టర్ జాసన్ స్మిత్ ( Inspector Jason Smith )ప్రకారం, ఇద్దరు స్నేహితులు ఒడ్డు నుంచి నీటిలోకి దిగారు.

ఒక విద్యార్థి నీటిలో చిక్కుకుపోగా మరొక విద్యార్థి ఆదుకోవడానికి ప్రయత్నించాడు.దురదృష్టవశాత్తు, ఈ ప్రయత్నంలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.

ఈ విషాద ఘటనను చూసిన మరొక స్నేహితుడు నేరుగా సహాయం చేయలేకపోయానని చెప్పాడు.

"""/" / క్విన్స్‌లాండ్ పోలీసులు, హెలికాప్టర్లు, అంబులెన్స్ టీంలతో సహా విస్తృత శోధనలు చేసినప్పటికీ, విద్యార్థులను వెంటనే కనుగొనలేకపోయారు.

ఈ ఘటన తర్వాత, ప్రశాంతమైన ఆ జలపాతాన్ని తాత్కాలికంగా క్లోజ్ చేశారు.సెర్చ్ ఆపరేషన్స్‌ ముగిసిన తర్వాత ఆ ప్రాంతాన్ని మళ్లీ ఓపెన్ చేశారు.

రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో పుష్ప 2 రికార్డ్స్ ను బ్రేక్ చేస్తాడా..?