ధనుష్ ( Dhanush )హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో ‘రాయన్ ‘( Rayan movie ) అనే సినిమా వస్తుంది.అయితే ఈ సినిమా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు పెంచడమే కాకుండా మొదటి నుంచి కూడా ఈ సినిమా పట్ల ప్రేక్షకులు చాలా ఆసక్తి ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని ఈరోజు రిలీజ్ చేశారు.ఇక మొత్తానికైతే ఈ సినిమా ధనుష్ కెరియర్ లో ఒక డిఫరెంట్ అటెంప్ట్ గా కనిపిస్తుంది.
ఇక ఈ సినిమాతో మరోసారి తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.ధనుష్ 50 వ సినిమాగా( Dhanush’s 50th movie ) తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ఇప్పటికే అంచనాలైతే తార స్థాయిలో పెరిగిపోయాయి.ఇక ఈ ట్రైలర్ ను చూసిన తర్వాత అటు ధనుష్ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమా పట్ల మంచి ఆసక్తి అయితే నెలకొంది.ఇక మొత్తానికైతే ఈ సినిమా 26వ తేదీన రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతుంది.
ఈ సినిమాతో మరోసారి ఆయన భారీ బ్లాక్ బాస్టర్ సక్సెస్ ను అందుకోవాలని చూస్తున్నాడు.ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయనకు సరైన సక్సెస్ అయితే దక్కడం లేదు.
అందుకోసమే ఆ సినిమాని ఇక్కడ కూడా రిలీజ్ చేసి భారీ సక్సెస్ ని అందుకొని తెలుగులో మార్కెట్ ను బాగా ఇంప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంలో ధనుష్ ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక ధనుష్ అనుకున్నట్టుగా సినిమా తెలుగులో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది.ఇక్కడి ప్రేక్షకులను మెప్పిస్తుందా లేదా అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…ఇక ఇప్పటి వరకైతే ఈ ట్రైలర్ చాలా ఎంగేజింగ్ గా ఉంది.అందుకే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో అంచనాలు భారీ గా పెరిగిపోయాయి…
.