అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ జోరందుకుంది.ఈ ఏడాది నవంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి.
రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ పార్టీ తరపున అధ్యక్షుడు జో బైడెన్‌లు పోటీపడుతున్నారు.అయితే ట్రంప్( Donald Trump ) తన రన్నింగ్ మేట్ (ఉపాధ్యక్షుడు)గా ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై నెలలుగా చర్చ జరుగుతోంది.
మధ్యలో పలువురు ప్రముఖుల పేర్లు తెరపైకి వచ్చినా అదంతా ప్రచారంగానే తేలింది.ఈ నేపథ్యంలో సస్పెన్స్‌కు తెరదించారు డొనాల్డ్ ట్రంప్.
ఒహియో సెనేటర్, తనకు గట్టి మద్ధతుదారుడైన 39 ఏళ్ల జెడీ వాన్స్‌ను 2024 ఎన్నికలకు తన రన్నింగ్ మేట్‌గా ప్రకటించారు.
మిల్వాకీలో జరుగుతున్న రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో ఆయన మాట్లాడుతూ.సుదీర్ఘమైన చర్చ, ఆలోచన తర్వాత ప్రతిభను ప్రామాణికంగా తీసుకుని వైస్ ప్రెసిడెంట్ కావడానికి వాన్స్( JD Vance ) బాగా సరిపోతారని నిర్ణయించుకున్నట్లు ట్రంప్ చెప్పారు.‘‘ Hillbilly Elegy: A Memoir of a Family and Culture in Crisis ’’ పుస్తకం ద్వారా వాన్స్ అమెరికా( America )లో బాగా పాపులర్ అయ్యారు.మధ్య అమెరికాలోని పేద శ్వేతజాతి వర్కింగ్ క్లాస్ కథను ఇతివృత్తంగా తీసుకుని ఆయన ఈ పుస్తకం రాశారు.2016లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నిక( US presidential election )ల బరిలో దిగినప్పుడు ఆయన విజయం కోసం వాన్స్ తీవ్రంగా శ్రమించారు.
తొలినాళ్లలో ట్రంప్‌ను తీవ్రంగా విమర్శించినా.తర్వాత ఆయనకు దగ్గరయ్యారు వాన్స్.ముఖ్యంగా వాణిజ్యం, వలసలు, ఫారిన్ ఎఫెర్స్‌పై ట్రంప్ విధానాలను జేడీ వాన్స్ ప్రశంసించారు.ఇప్పుడు అమెరికా ఫస్ట్ నినాదాన్ని సమర్ధించే యువతరం సంప్రదాయవాదులకు సలహాదారు, మద్ధతుదారుగానూ ఆయన మారారు.
రానున్న ఎన్నికల్లో కనుక వాన్స్ గెలిస్తే .అమెరికా చరిత్రలో మూడవ అతిపిన్న వయస్కుడైన ఉపాధ్యక్షుడు అవుతారు.1857లో జాన్ బ్రెకిన్‌రిడ్జ్ 36 ఏళ్ల వయసులోనే ఉపాధ్యక్షుడు అయ్యారు.1953లో రిచర్డ్ నిక్సన్ 40 సంవత్సరాల 11 రోజుల వయసులో వైస్ ప్రెసిడెంట్‌గా విజయం సాధించారు.యూఎస్ మెరైన్ కార్ప్స్‌లో సేవ, ఒహియో స్టేట్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్, యేల్ లా స్కూల్‌లో జేడీ వాన్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.అలాగే ది యేల్ లా జర్నల్ ఎడిటర్‌గా, యేల్ లా వెటరన్స్ అసోసియేష్ ప్రెసిడెంట్‌గానూ సేవలందించారు.
డొనాల్డ్ ట్రంప్ కుమారుడు .జూనియర్ ట్రంప్‌కు వాన్స్ అత్యంత సన్నిహితుడు.