తెలుగు సినిమా ఇండస్ట్రీ హవా అనేది రోజురోజుకి పెరుగుతూ వస్తుంది.ఇక ఇప్పటికే పాన్ ఇండియాలో సత్తా చాటుకుంటున్న మన హీరోలు ఇప్పుడు పాన్ వరల్డ్ లో( Pan World ) కూడా తమ స్టామినా ఏంటో చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు.
ఇక అందులో భాగంగానే రాజమౌళి( Rajamouli ) డైరెక్షన్ లో మహేష్ బాబు( Mahesh Babu ) హీరోగా వస్తున్న పాన్ వరల్డ్ సినిమా కూడా భారీ అంచనాలతో తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు తెలుగే పరిమితమైన మన హీరోలు ఇప్పుడు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలను లైన్ లో పెట్టే ప్రయత్నంలో ఉన్నారు.
ఇప్పటికే ప్రభాస్,( Prabhas ) ఎన్టీఆర్( NTR ) లాంటి హీరోలు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నారు.మన హీరోలతో సినిమాలు చేయడానికి అక్కడి దర్శకులు ఆసక్తి చూపిస్తున్నప్పటికీ మన వాళ్లే వాళ్ళని పెద్దగా నమ్మడం లేదు.అందుకే మన దర్శకులతోనే సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.ఇక ఏది ఏమైనప్పటికీ సౌత్ సినిమాల హవా బాలీవుడ్ లో( Bollywood ) కొనసాగుతుండటం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.
ఇక అందులోనూ తెలుగు సినిమాల హవా మరింత రేంజ్ లో ముందుకు దూసుకెళ్లడం అనేది నిజంగా మన తెలుగు వాళ్ళందరూ గర్వించదగ్గ విషయమనే చెప్పాలి.ఇలాంటి సందర్భంలోనే ప్రభాస్ కల్కి సినిమాతో( Kalki ) భారీ సక్సెస్ ని అందుకొని మరోసారి తెలుగు వాళ్ల స్టామినా ఏంటో చూపించాడు.
ఇక వరుసగా నెలకు ఒక సినిమా చొప్పున బాలీవుడ్ మీద దండయాత్ర చేయడానికి మన సినిమాలు రెడీ అవుతున్నాయి.
ఆగస్టు 15వ తేదీన ‘డబుల్ ఇస్మార్ట్’( Double Ismart ) సినిమాతో రామ్ ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, సెప్టెంబర్ 27వ తేదీన ‘దేవర ‘( Devara ) సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడు…ఇలా మన హీరోలు సాధిస్తున్న సక్సెస్ లా దూకుడును బాలీవుడ్ ఇండస్ట్రీ ఎలాగూ ఆపలేక పోతుంది.వాళ్ల సినిమాలతో ఆయన సక్సెస్ కొడుతున్నారా అంటే అది కూడా కొట్టడం లేదు.ఇప్పుడు రెండు రకాలుగా బాలీవుడ్ కి దెబ్బ పడుతుందనే చెప్పాలి.
ఇక దీనివల్ల వాళ్ళు భారీగా నష్టపోతున్నారనే చెప్పాలి…