ప్రస్తుతమున్న రోజుల్లో పెళ్లి అంటే ఒక గొప్ప స్టేటస్ సింబల్ ఎంత గొప్పగా పెళ్లి చేస్తే అంత గొప్ప వారీగా ఈ సమాజం వారిని గుర్తిస్తుంది.అందుకే అదే బ్రమలో వందల కోట్లు వేల కోట్లు ఖర్చుపెట్టి పెళ్లిళ్లు చేస్తున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అంబాని ఇంటి చిన్నపుత్ర రత్నం అనంత్ అంబానీ( Anant Ambani ) పెళ్లి గురించే వార్తలు వస్తున్నాయి.పెళ్లి చాలా ఘనంగా 5000 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి చేశారు అంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతుంది.
అంబానీ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడో మనకు లెక్కలు ఎలాగు చెప్పడు.కానీ ఈ పెళ్లి తర్వాత ప్రస్తుతం అంబానీ బిజినెస్ మాత్రం చిక్కుల్లో పడ్డట్టుగా తెలుస్తోంది.
కేవలం అంబానీ మాత్రమే కాదు వెళ్లిన ఒక స్టేటస్ సింబల్ గా భావించిన కొంతమంది సోషల్ మీడియా సెలబ్రిటీస్ లేదా రాజకీయ నాయకులు చిక్కులను కొని తెచ్చుకున్నారు.ఇంతకు ఆ స్టేటస్ సింబల్ కోసం పెళ్లిళ్లు చేసిన గొప్ప వ్యక్తులు ఎవరు ? ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు అనే విషయాలను ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
జయలలిత
జయలలితకు( Jayalalitha ) వివాహం జరగలేదు అలాగే పిల్లలు లేరు కానీ ఆమె స్నేహితురాలైన శశికళ కుమారుని దత్తత తీసుకుంది.ఆ తర్వాత అతని వివాహాన్ని ఈ ఇండియాలోనే ఎవ్వరు చేయనంత ఘనంగా అప్పట్లోనే చాలా ఖర్చుపెట్టి వివాహం చేసింది.ఆమె వివాహం చేసిన తీరు చూసి తమిళనాడు ముక్కున వేలేసుకుంది.ఇక్కడ వరకు బాగానే ఉంది మరి ఇన్ని వందల కోట్లు ఆమెకు ఎక్కడివి అంటూ ఆమెపై విచారణ మొదలయ్యింది.ఆ తర్వాత ఆమె ఈ పెళ్లికి పెట్టిన ఖర్చు విషయంలో ఏకంగా జైలు పాలైంది.
అంబానీ
ముఖేష్ అంబానీ( Mukesh Ambani ) చిన్న కుమారుడు అనంత అంబానీ వివాహ వేడుక కూడా ప్రస్తుతం అనేక సంచలనాలకు దారితీస్తుంది.వారి వివాహ వేడుకలు జరిగిన ఖర్చు చూసి యావత్ ప్రపంచమే నివ్వరబోతోంది.అయితే ఈ కారణంగా ప్రస్తుతం అంబానికి సంబంధించిన జియో కంపెనీ( Jio Company ) దివాళ తీసే పరిస్థితి వస్తుంది అని తెలుస్తుంది ఎందుకంటే అతను పెట్టిన ఖర్చంత ఆ జనాలు తమ చేతిలోంచి పెట్టిన డబ్బులు లేదంటే జియో రీఛార్జ్ ల ద్వారా చెల్లించిన సొమ్ము గానే భావిస్తున్నారు.
అందుకే ఏకంగా పెళ్లి సమయంలో ఒక మూడు రోజుల వ్యవధిలోనే 70 లక్షల మంది జియో నుంచి బిఎస్ఎన్ఎల్ కి షిఫ్ట్ అయ్యారట.ఇది నిజమో కాదో తెలియదు కానీ ప్రస్తుతం యావత్ భారతదేశం మాత్రం వారి పెళ్లి వేడుకల విషయంలో అసంతృప్తిగా ఉంది.
ఇంత ఘనంగా చేయాల్సిన అవసరం ఏముంది.పైగా ఆ డబ్బు అంతా కూడా ఎక్కడిది ? ఎవరి నుంచి వస్తోంది దేశంలో పావర్టి బిలో ఉన్న 40% మంది చేతులో ఉండాల్సిన సంపద కేవలం అంబానీ చేతుల్లోనే ఉంది అంటూ కొన్ని వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు.
గాలి జనార్దన్ రెడ్డి
మైనింగ్ కింగ్ గా ఉన్న గాలి జనార్దన్ రెడ్డి( Gali Janardhan Reddy ) మొదటి నుంచి సంచలనాలకు కేరాఫ్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నారు.అతని ఇంట్లో ఆ మధ్య జరిగిన తన సంతానానికి పెళ్లి అనేక చర్చలకు దారి తీసింది.వందల కోట్లు ఖర్చుపెట్టి అతను చేసుకున్న పెళ్లి కారణంగా ఇన్కమ్ టాక్స్ సమస్యలు జరిగాయి.అతనిపై కేసు కూడా నమోదయి కొన్నాళ్లపాటు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.