నామినేటెడ్ పదవుల భర్తీ పై లోకేష్ ఫోకస్ .. అదే ఇబ్బంది 

ఏపీలో అధికారం దక్కించుకున్న టిడిపి జనసేన, బిజెపి కూటమి పూర్తిగా పరిపాలనపై దృష్టి పెట్టింది.ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలకు కసరత్తు చేస్తుంది.

 Lokesh's Focus On Filling Nominated Posts That S The Problem, Tdp, Telugudesham,-TeluguStop.com

ఒక్కో హామీని నెరవేరుస్తూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తుంది.ఇప్పటికే మంత్రి పదవులు విషయంలో టిడిపి మిత్ర ధర్మాన్ని పాటిస్తూ,  జనసేన , బీజేపీలకు మంత్రి పదవులు కేటాయించింది.

  దీనికి తగ్గట్లుగానే కేంద్రంలోనూ బిజెపి ప్రభుత్వం( BJP ) టిడిపికి మంత్రి పదవులు కేటాయించింది.ఇక ఏపీలో ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంపై దృష్టి సారిస్తోంది.

  ఈ మేరకు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి ,మంత్రి నారా లోకేష్ ( Nara Lokesh )నామినేటెడ్ పదవుల భర్తీ విషయంపై ఫోకస్ చేశారు.పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అధికార పార్టీ వైసీపీని ఎదుర్కొంటూ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నేతలకు నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో న్యాయం చేయాలని టిడిపి భావిస్తుంది.

Telugu Ap, Chandrababu, Janasena, Lokesh, Telugudesham-Politics

ఈ మేరకు పదవుల భర్తీ ఏ విధంగా చేపట్టాలి .మిత్ర పక్షాలైన బిజెపి, జనసేనకు ఈ నామినేటెడ్ పోస్ట్ ల విషయంలో ఏ విధంగా న్యాయం చేయాలనే విషయం పైన లోకేష్ కసరత్తు చేస్తున్నారు.వివిధ శాఖల్లో దాదాపు 95 కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.వీటిలో జనసేనకు, బిజెపికి ఎన్ని కేటాయిస్తారు అనేది తేలాల్సి ఉంది.బిజెపి జనసేన కూడా ప్రస్తుతం చేపట్టబోయే నామినేటెడ్ పదవుల విషయంలో ఆసక్తి గానే ఉన్నాయి.తమ పార్టీలో కష్టపడి పనిచేసిన నేతలకు కీలకమైన నామినేటెడ్ పదవులు దక్కేలా ప్రయత్నాలు మొదలుపెట్టారు.

Telugu Ap, Chandrababu, Janasena, Lokesh, Telugudesham-Politics

అయితే ఈ పదవుల భర్తీ విషయంలో తమ మిత్రపక్షాలైన జనసేన, బిజెపిల( Jana Sena , BJP )కు ఎటువంటి అసంతృప్తి కలగకుండా జాగ్రత్తగా ఈ పదవుల భర్తీ చేపట్టాలని లోకేష్ భావిస్తున్నారు.  ఈ విషయంలో టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సూచనలతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నామినేటెడ్ పోస్టులను ఎక్కడ ఎవరికి ఏ విధంగా పదవులు కేటాయించాలనే విషయంపైనే లోకేష్ గత కొద్ది రోజులుగా కసరత్తు చేస్తున్నారు.ఈ పదవులపై మూడు పార్టీలకు చెందిన నేతలు ఆశలు పెట్టుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube