నామినేటెడ్ పదవుల భర్తీ పై లోకేష్ ఫోకస్ .. అదే ఇబ్బంది 

ఏపీలో అధికారం దక్కించుకున్న టిడిపి జనసేన, బిజెపి కూటమి పూర్తిగా పరిపాలనపై దృష్టి పెట్టింది.

ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలకు కసరత్తు చేస్తుంది.ఒక్కో హామీని నెరవేరుస్తూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తుంది.

ఇప్పటికే మంత్రి పదవులు విషయంలో టిడిపి మిత్ర ధర్మాన్ని పాటిస్తూ,  జనసేన , బీజేపీలకు మంత్రి పదవులు కేటాయించింది.

  దీనికి తగ్గట్లుగానే కేంద్రంలోనూ బిజెపి ప్రభుత్వం( BJP ) టిడిపికి మంత్రి పదవులు కేటాయించింది.

ఇక ఏపీలో ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంపై దృష్టి సారిస్తోంది.  ఈ మేరకు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి ,మంత్రి నారా లోకేష్ ( Nara Lokesh )నామినేటెడ్ పదవుల భర్తీ విషయంపై ఫోకస్ చేశారు.

పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అధికార పార్టీ వైసీపీని ఎదుర్కొంటూ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నేతలకు నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో న్యాయం చేయాలని టిడిపి భావిస్తుంది.

"""/" / ఈ మేరకు పదవుల భర్తీ ఏ విధంగా చేపట్టాలి .

మిత్ర పక్షాలైన బిజెపి, జనసేనకు ఈ నామినేటెడ్ పోస్ట్ ల విషయంలో ఏ విధంగా న్యాయం చేయాలనే విషయం పైన లోకేష్ కసరత్తు చేస్తున్నారు.

వివిధ శాఖల్లో దాదాపు 95 కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.వీటిలో జనసేనకు, బిజెపికి ఎన్ని కేటాయిస్తారు అనేది తేలాల్సి ఉంది.

బిజెపి జనసేన కూడా ప్రస్తుతం చేపట్టబోయే నామినేటెడ్ పదవుల విషయంలో ఆసక్తి గానే ఉన్నాయి.

తమ పార్టీలో కష్టపడి పనిచేసిన నేతలకు కీలకమైన నామినేటెడ్ పదవులు దక్కేలా ప్రయత్నాలు మొదలుపెట్టారు.

"""/" / అయితే ఈ పదవుల భర్తీ విషయంలో తమ మిత్రపక్షాలైన జనసేన, బిజెపిల( Jana Sena , BJP )కు ఎటువంటి అసంతృప్తి కలగకుండా జాగ్రత్తగా ఈ పదవుల భర్తీ చేపట్టాలని లోకేష్ భావిస్తున్నారు.

  ఈ విషయంలో టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సూచనలతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నామినేటెడ్ పోస్టులను ఎక్కడ ఎవరికి ఏ విధంగా పదవులు కేటాయించాలనే విషయంపైనే లోకేష్ గత కొద్ది రోజులుగా కసరత్తు చేస్తున్నారు.

ఈ పదవులపై మూడు పార్టీలకు చెందిన నేతలు ఆశలు పెట్టుకున్నారు.

ప్రశాంత్ వర్మ వైఖరి ఏంటో అర్థం కావడం లేదంటున్న విమర్శకులు… అసలేం జరిగింది..?