ఐదేళ్లలో జక్కన్న ఒక సినిమా తీస్తే ప్రభాస్ 5 సినిమాలు.. రాజమౌళి మారక తప్పదా?

బాహుబలి2( Bahubali 2 ) సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అటు రాజమౌళి ఇటు ప్రభాస్ ( Prabhas )కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్నారు.అయితే ఈ సినిమా విడుదలై దాదాపుగా ఏడేళ్లు అవుతుండగా ఈ ఏడేళ్లలో రాజమౌళి తీసిన ఒకే ఒక్క సినిమా ఆర్.

 This Is The Difference Between Prabhas And Rajamouli Details Inside , Prabhas-TeluguStop.com

ఆర్.ఆర్ అనే సంగతి తెలిసిందే.ఇదే సమయంలో ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి 2898 ఏడీ విడుదలయ్యాయి.ఈ సినిమాలలో మూడు సినిమాలు గత ఏడాది కాలంలోనే రిలీజయ్యాయి.

ప్రభాస్ ను చూసి జక్కన్న మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి.రాజమౌళి ఒక్కో సినిమాకు ఇంత సమయం తీసుకోవడం వల్ల హీరోల కెరీర్ పై కూడా ఆ ప్రభావం పడుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

రాజమౌళి మహేష్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలై కూడా దాదాపుగా రెండు సంవత్సరాలు అయిన సంగతి తెలిసిందే.

మహేష్ రాజమౌళి( Rajamouli ) కాంబో కచ్చితంగా సంచలనాలు సృష్టించే అవకాశాలు ఉన్నాయి.అయితే ఈ సినిమా రిలీజ్ కావడానికి రెండేళ్ల సమయం పడుతుందో మూడేళ్ల సమయం పడుతుందో మాత్రం కచ్చితంగా చెప్పలేము.మరి రాజమౌళి వేగంగా సినిమా తీసే దిశగా అడుగులు వేస్తారేమో చూడాల్సి ఉంది.

జక్కన్న బ్యాక్ బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మహేష్ రాజమౌళి కాంబో మూవీ బడ్జెట్ 1000 కోట్ల రూపాయలు అని వార్తలు వినిపిస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.జక్కన్న నెక్స్ట్ లెవెల్ కథాంశాలను ఎంచుకుంటున్నా సినిమాలు నిదానంగా తీయడం ఫ్యాన్స్ ను బాధిస్తోంది.రాజమౌళి మహేష్ కు ఏ రేంజ్ హిట్ ఇస్తారో అనే చర్చ సైతం సోషల్ మీడియాలో జరుగుతుండటం గమనార్హం.

ఈ సినిమా కోసం విదేశీ ప్రేక్షకులు సైతం ఎదురుచూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube