అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వారిపై పోలీస్ కొరడా..

రాజన్న సిరిసిల్ల జిల్లా : తరచు అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే వాహనాల జప్తు కోసం అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైనింగ్ అప్పజెప్పడం జరుగుతుందనీ జిల్లా ఎస్పీ అన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వాహనాలను గుర్తించి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సీజ్ చేయడం జరుగుతుంది అని ,అక్రమ ఇసుక రవాణాలో రెండు సార్ల కన్నా ఎక్కువ సార్లు వాహనాలు పట్టుపడితే అట్టి వాహనాల జప్తు కోసం అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైనింగ్ సిరిసిల్ల కి అప్పజెప్పడం జరిగుతుందన్నారు.

 Police Whip Against Those Involved In Illegal Transport Of Sand District Sp Akhi-TeluguStop.com

అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైనింగ్ వారు అట్టి వాహనాలను కోర్టులో హాజరు పర్చగా అట్టి వాహనాలను కోర్ట్ జప్తు చేసి అట్టి వాహనాల మీద కోర్ట్ కఠిన చర్యలు తీసుకుంటుంది అన్నారు.వ్యవసాయ పనులు నిమిత్తం సబ్సిడీలో తీసుకున్న ట్రాక్టర్ లు వ్యవసాయ పనులు మినహా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతూ పట్టుబడితే అట్టి ట్రాక్టర్లు సీజ్ చేసి వాటియెక్క సబ్సిడీ రద్దు చేయుటకోసం సిపార్సు చేయడం జరుగుతుందన్నారు.

బుధవారం అక్రమ ఇసుక రవాణాను కట్టడి చేసే చర్యల్లో భాగంగా ముస్తాబాద్ , ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ల పరిధిలో 08 వాహనాలు గుర్తించి అట్టి వాహనాలను సీజ్ చేసి 12 మందిపై కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై తరచు ప్రత్యేక తనిఖీలు నిర్వహించడం జరుగుతుదన్నారు.

జిల్లాలో 2024 సంవత్సరంలో అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్న వారిపై 163 మందిపై కేసులు నమోదు చేసి 161 వాహనాలు సీజ్ చేయడం జరిగిందని, తరచు అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వారిపై 14 కేసులల్లో 21 మందిని రిమాండ్ చేయడం జరిగిందని, అనుమతి లేకుండా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకొని,ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని ఇసుక రవాణానాకు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని సంబంధం ఉన్న వ్యక్తుల పై చర్యలు తప్పవని హెచ్చరించారు.ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు సమాచారం అందించాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube