రాజన్న సిరిసిల్ల జిల్లా: వర్షాకాలం నేపథ్యంలో పశువులు, గొర్రెలు, మేకలకు వచ్చే వ్యాధులపై పెంపకందారులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా( Collector Sandeep Kumar Jha ) అధికారులను ఆదేశించారు.పశుసంవర్ధక శాఖ పై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాలులో ఆ శాఖ అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పాడి పరిశ్రమ, పాడి ఉత్పత్తులు వివరాలు అడిగి తెలుసుకున్నారు.వర్షాకాలం నేపథ్యంలో పశువులు, గొర్రెలు, మేకలకు వచ్చే వ్యాధులపై అవగాహన కల్పించాలని, రోగాల నివారణకు వ్యాక్సిన్లు, మందులు అందుబాటులో ఉంచాలని, వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కొమురయ్య ఏ .డి.డా.రమణ మూర్తి, డా.అంజిరెడ్డి ఇతర వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు.