యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ( Yadadri Sri Lakshmi Narasimha Swamy )ఆలయాన్ని తెలంగాణ చీఫ్ సెక్రెటరీ శాంతకుమారి( CS Shanti Kumari ) మంగళవారం దర్శించుకున్నారు.ఆమెకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
అనంతరం ప్రధాన ఆలయంలోని స్వయంభు మూర్తులను ప్రత్యేక ఏర్పాట్ల నడుమ దర్శించుకొని,ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.ఆలయ ముఖ మండపంలో వేద పండితులచే వేద ఆశీర్వచనం పొందారు.
దర్శనం అనంతరం స్వామి వారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని ఆలయ ఈవో భాస్కర్ రావు( Eo Bhaskar Rao ) ఆమెకు అందజేశారు.