ప్రస్తుతం వర్షాకాలం మొదలైంది.ప్రతిచోట వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలలో బహిరంగ ప్రదేశాలు ఉంటే పాములు( Snakes ) తిరగడం సహజం.
కాబట్టి వర్షాకాలంలో పాములు ఇంట్లోకి వచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయి.ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది.
ముఖ్యంగా ఇంట్లో ఎలుకలు లేకుండా చూసుకుంటే ఇలాంటి వాటికి కాస్త దూరంగా ఉండవచ్చు.మామూలుగా చాలామంది మనలో పాము పేరు చెబితేనే భయపడతారు.
ఇక కొద్ది దూరంలో విషపూరితమైన పాములు ఉన్నాయంటే ఆ ప్రాంతంలో కూడా ఉండకుండా వెళ్ళిపోతారు.ఇక విషపూరితమైన నాగుపాముల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
కొందరికి ఈ పేరు వింటే చాలు వణుకు పుడుతుంది.
అలాంటిది ఒక్క పాము చూస్తేనే ఇలా జరుగుతే ఏకంగా 32 పాములు ఒకే చోట ప్రత్యక్షమైతే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఊహించుకోండి.అలాంటి పరిస్థితి తాజాగా కొత్తగూడెం పట్టణంలోని ఓ ఇంట్లో( Home ) జరిగింది.ఇంట్లో కుప్పలు కుప్పలుగా నాగుపాము పిల్లలు ప్రత్యక్షమయ్యాయి.
కొత్తగూడెంలోని( Kothagudem ) నెహ్రూ బస్తీలోని నివసిస్తున్న ఎలక్ట్రీషియన్ రాజు( Electrician Raju ) ఇంట్లోనే గోడ రంధ్రములో పాము పిల్లలు కనిపించాయి.దాంతో బయపడిపోయిన ఆయన, ఆయనతోపాటు కుటుంబ సభ్యులందరూ ఇంట్లో నుంచి బయటికి వచ్చేసారు.
ఆ తర్వాత రాజు వెంటనే స్నేక్ క్యాచర్( Snake Catcher ) టీంకు సమాచారం అందించగా వారు రంగంలోకి దిగారు.స్నేక్ క్యాచర్ దత్తు టీం ఇల్లంతా జల్లెడ పట్టి కొన్ని గంటలపాటు శ్రమించి ఏకంగా ఒక పెద్ద నాగుపాముతో పాటు 32 నాగుపాములను పట్టుకున్నారు.వాటన్నిటిని వివిధ డబ్బాలలో బంధించారు.పాము పిల్లలు చూడడానికి చిన్నదే అయిన వాటిని డబ్బాలో బంధించిన తర్వాత చూడగా అవి పడగవిప్పి బుసలు కొడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.
వాటిని చూసిన వారందరూ భయబ్రాంతులకు లోనయ్యామని తెలిపారు.కాబట్టి వర్షాకాలంలో మీ ఇంట్లోని ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయండి.