తాజాగా మలేషియా ఎయిర్‌లైన్స్( Malaysia Airlines ) కు చెందిన విమానం కుడివైపు ఇంజనులో మంటలు చెలరేగాయి.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న విమానానికి ఈ ఘటన ఎదురైంది.హైదరాబాద్ నుండి టేక్ ఆఫ్ అయిన 15 నిమిషాలకే కుడివైపు ఇంజన్లో మంటలు చిలరేగడంతో విమానంలోని ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.
అయితే మంటలు చెలరేగిన వెంటనే విమాన పైలట్ మంటలను గుర్తించడంతో అతడు తీసుకున్న నిర్ణయాల కారణంగా ప్రయాణికులను సేఫ్‌గా బయటపడేశాడు.ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

గురువారం ఉదయం హైదరాబాదు నుండి కోలాలంపూర్ మలేషియాకు( Kuala Lumpur Malaysia ) బయలుదేరిన మలేషియా ఎయిర్‌లైన్స్ విమానంలో ఈ ఘటన జరిగింది.విమానంలో 130 మంది ప్రయాణికులు, విమాన సిబ్బంది అందరూ ప్రయాణం చేస్తున్నారు.ఇక హైదరాబాదులో అన్ని చెకప్స్ తర్వాతనే పర్మిషన్ తీసుకున్న తర్వాతనే పైలెట్ విమానాన్ని టేకాఫ్ చేశాడు.అలా టేకప్ జరిగిన 15 నిమిషాలకే విమానంలోని కుడి వైపు ఇంజన్ భాగంలో మంటలు చెలరేగాయి.
అయితే ఈ మంటలను గమనించిన విమానం పైలెట్ వెంటనే అలర్ట్ అయ్యి విషయాన్ని ఎయిర్పోర్ట్ అధికారులకు తెలిపి పైలట్ ల్యాండింగ్‌కు అనుమతిని కోరాడు.దాంతో వెంటనే ప్రమాద తీవ్రతను గుర్తించిన అధికారులు పైలెట్ లాండింగ్ కు అనుమతి ఇచ్చారు.
అయితే ఈ సమయంలో ప్రయాణికులు భయపడకూడదని అధికారులు తెలపగ వారందరూ బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకున్నారు.

ఈ నేపథ్యంలో అధికారులు అత్యవసర ల్యాండింగ్ అనుమతించడంతో వెంటనే మలేషియా ఎయిర్‌లైన్స్ విమానాన్ని మరోసారి హైదరాబాదు ఎయిర్ పోర్టులో సేఫ్ గా ల్యాండ్ చేశారు.ఈ ఘటనలో విమానంలో 130 మందితో పాటు సిబ్బందికి కూడా ఎలాంటి ప్రమాదం సంభవించకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.ఈ ఘటనలో ప్రయాణికులు విమాన పైలెట్ ను అలాగే, ఏటిసి అధికారులను ప్రశంసించారు.
అధికారులు మాకు పునర్జన్మ ప్రసాధించారంటూ ప్రయాణికులు తెలిపారు.అయితే ఈ ఘటనలో విమానంలో ఎందుకు మంటలు చెలరేగాయో అధికారులు చర్యలు చేపట్టారు.







