హీరో రామ్ చరణ్( Ram Charan ) గురించి మనందరికీ తెలిసిందే.చెర్రీ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు.
ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొక వైభవ్ తన ఫ్యామిలీతో కావలసినంత సమయాన్ని గడుపుతూ చిల్ అవుతున్నారు చెర్రీ.ఇకపోతే రాంచరణ్ ఇటీవలే తండ్రిగా ప్రమోషన్ కూడా పొందిన విషయం తెలిసిందే.
రామ్ చరణ్ ఉపాసన దంపతులకు క్లీంకారకు ( Klin Kara )అనే పాప కూడా పుట్టింది.ఇక పాప పుట్టినప్పటినుంచి ఇప్పటివరకు పాప ఫేస్ ని రివిల్ చేయలేదు మెగా ఫ్యామిలీ.

ఎక్కడికి వెళ్లినా కూడా తన కూతురు ముఖం కనిపించకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ వస్తున్నారు ఉపాసన దంపతులు.ఇక కూతురు పుట్టిన తర్వాత ఎక్కువ సమయాన్ని కూతురు తోనే గడపడానికి ఇష్టపడుతున్నారు చెర్రీ.ఇది ఇలా ఉంటే తాజాగా రామ్ చరణ్ ఫాదర్స్ డే సందర్భంగా తన కూతురితో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఈ మేరకు అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చారు చెర్రీ.
క్లీంకారకు గోరు ముద్దలు తినిపించడం తనకెంతో ఇష్టమని, రోజులో రెండుసార్లైనా స్వయంగా తినిపిస్తానని, తాను తినిపిస్తే గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందేనని ఆ విషయంలో తనని ఎవరూ ఓడించలేరని కూతురుపై ప్రేమను వ్యక్తపరిచారు.

క్లీంకార ఇప్పుడిప్పుడే కుటుంబ సభ్యుల్ని గుర్తిస్తోందని, సినిమా షూటింగ్ లకు వెళ్లినప్పుడు తనని ఎంతో మిస్ అవుతున్నట్లు తెలిపారు.ఇకపై తన బిడ్డతో ఎక్కువ సమయం వెచ్చించేలా తదుపరి చిత్రాల షెడ్యూల్స్ ప్లాన్ చేసుకోనున్నట్లు తెలిపారు.క్లీంకారతో ఉన్నప్పుడు తన తండ్రి చిరంజీవి ఆమెకు పెద్దన్నలా మారిపోతారని ఆమెతో తాత అని పిలిపించుకోవడం బోర్గా ఫీలవుతారని చిరుత అని పిలవమంటూ మురిసిపోతారని తెలిపారు.
ఇక కెరీర్ విషయంలో భవిష్యత్తులో తన బిడ్డ తల్లి బాటలో నడిస్తే బాగుంటుందని ఆకాంక్షించారు.ఎందుకంటే ఇప్పటికే తమ కుటుంబంలో చాలామంది నటులు ఉన్నారని సినిమాల విడుదల విషయంలో తాము పోరాడుతున్నామని ఇప్పుడీ రంగంలో తన కూతురితో గొడవ పడటం తనకిష్టం లేదని చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం రామ్చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ ముగింపు దశలో ఉండగా.బుచ్చిబాబు దర్శకత్వంలో చేయాల్సిన సినిమా చిత్రీకరణకు సిద్ధమవుతోంది.







