చిన్న వయస్సులోనే పెళ్లి జరిగితే కెరీర్ పరంగా సక్సెస్ సాధించడం సులువు కాదనే సంగతి తెలిసిందే.కొల్లిపర వెంకటలక్ష్మి సక్సెస్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.
గుంటూరు( Guntur) జిల్లాలోని పొన్నూరు వెంకటలక్ష్మి( Ponnuru Venkatalakshmi ) స్వస్థలం కాగా మేము మొత్తం నలుగురు పిల్లలం అని ఆమె అన్నారు.కుటుంబ ఆదాయం అంతంత మాత్రంగానే ఉందని వెంకట లక్ష్మి వెల్లడించడం గమనార్హం.

ఇంటర్ పూర్తైన వెంటనే పెళ్లి చేశారని నాన్న నన్ను చదివించలేనంటే ఇంటర్ తోనే ఆపేశానని వెంకట లక్ష్మి అన్నారు.నేను ఇంట్లోనే ఉండి నాన్నకు కుట్టుపనిలో సాయం చేసేదానినని ఆమె తెలిపారు.పెళ్లి తర్వాత నా భర్త చిన్న వ్యాపారం చేసేవారని వెంకట లక్ష్మి వెల్లడించారు.నన్ను చదివిస్తే మాత్రమే పెళ్లికి ఒప్పుకుంటానని పెళ్లికి ముందే మాట తీసుకున్నానని ఆమె పేర్కొన్నారు.

అలా ఆపేసిన చదువును ఏడు సంవత్సరాల తర్వాత తిరిగి మొదలుపెట్టానని ఆమె వెల్లడించారు.డిగ్రీలో బీఏ లిటరేచర్ ( BA English Literature )స్పెషల్ ఇంగ్లీష్ చదివి టౌన్ ఫస్ట్ వచ్చానని వెంకట లక్ష్మి అన్నారు.అత్తామామల సహకారంతో రెగ్యులర్ గా కాలేజ్ కు వెళ్లి చదివానని వెంకట లక్ష్మి తెలిపారు.ఆ తర్వాత పద్మావతి కాలేజ్ లో ఎం.ఏ ఇంగ్లీష్ చేశానని ఆమె పేర్కొన్నారు.ఆ తర్వాత పద్మావతిలో ఎంఫిల్ మొదలుపెట్టానని ఆమె పేర్కొన్నారు.
చేబ్రోలులోని ఇంజనీరింగ్ కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తూనే ఇండియన్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ అనే అంశంపై పీహెచ్డీ చేశానని వెంకటలక్ష్మి వెల్లడించారు.ప్రముఖ అంతర్జాతీయ జర్నల్స్ లో నా వ్యాసాలు వెలువడ్డానని వెంకట లక్ష్మి పేర్కొన్నారు.
ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో ఇంగ్లీష్ లో టాపర్ గా నిలిచిన వాళ్లకు స్కాలర్ షిప్ అందిస్తానని ఆమె చెప్పుకొచ్చారు.వెంకట లక్ష్మి చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.