నటి హేమకు మరో షాక్.. ‘మా’ అసోసియేషన్ నుంచి సస్పెండ్

సినీ నటి హేమ( Hema )కు మరో షాక్ తగిలింది.బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన హేమను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సస్పెండ్ చేసింది.

 Another Shock For Actress Hema.. Suspended From 'maa' Association ,hema ,maa-TeluguStop.com

రేవ్ పార్టీ( Rave Party Case )లో నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసుల విచారణలో నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే.కాగా కేసు వ్యవహారంపై వివరణ ఇవ్వాలని హేమకు నోటీస్ ఇచ్చినా స్పందించకపోవడంతో ఆమెను సస్పెండ్ చేసినట్లు ‘ మా’ అధ్యక్షుడు మంచు విష్ణు( Manchu Vishnu) తెలిపారు.

రేవ్ పార్టీ కేసులో హేమకు క్లీన్ చిట్ వచ్చే వరకూ ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని విష్ణు వెల్లడించారు.కాగా రేవ్ పార్టీ కేసులో హేమను కోర్టులో హాజరు పరచగా.

జూన్ 14 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube