రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలోని భీమారం మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన కొంగ గంగానర్సయ్య బుధవారం పిడుగు పాటుకు గురై మృతి చెందగా విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్,
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తో కలసి జగిత్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన వైద్యశాలలో వారి కుటుంబసభ్యులను పరామర్శించారు.తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.బాధిత కుటుంబాన్ని అదుకుంటామని హామీ ఇచ్చారు.







