సౌందర్య చనిపోతే ఏడవాలని రూల్ లేదు... జగపతిబాబు షాకింగ్ కామెంట్స్!

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో దివంగత నటి సౌందర్య ( Soundarya ) ఒకరు.ఈమె కన్నడ నటి అయినప్పటికీ తెలుగులో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

 Jagapathi Babu Shocking Comments On Soundarya Death ,soundarya, Jagapathi Babu ,-TeluguStop.com

అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున జగపతిబాబు వంటి స్టార్ హీరోలు అందరితో కలిసి నటించి బ్లాక్ బాస్టర్ సినిమాలను ఈమె సొంతం చేసుకున్నారు.ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఉన్నటువంటి ఈమె అనుకోకుండా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.

Telugu Balakrishna, Chiranjeevi, Jagapathi Babu, Soundarya, Tollywood-Movie

ఇలా సౌందర్యం మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా 2004వ సంవత్సరంలో ఈమె తన సోదరుడు అమర్నాథ్ తో కలిసి హెలికాప్టర్ లో ప్రయాణిస్తూ ఉండగా హెలికాప్టర్ ప్రమాదానికి కూడా మరణించారు.అయితే సౌందర్యకు ఇండస్ట్రీలో మంచి స్నేహితులుగా కొనసాగుతున్నటువంటి వారిలో ఆమని(Amani ),జగపతిబాబు( Jagapathi Babu ) వంటి వారు ఒకరు.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి జగపతిబాబుకి సౌందర్య గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

Telugu Balakrishna, Chiranjeevi, Jagapathi Babu, Soundarya, Tollywood-Movie

సౌందర్య మీకు చాలా మంచి స్నేహితురాలు ఆమె మరణించిన సమయంలో మీ మానసిక పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ఎదురయింది.

ఈ ప్రశ్నకు జగపతిబాబు సమాధానం చెబుతూ నేను ఫిలాసఫీనీ నమ్ముతానని తెలిపారు.పుట్టిన వాళ్లు చనిపోక తప్పదు.జీవితంలో డబ్బును కోల్పోతే తిరిగి సంపాదించుకోవచ్చు గాని ప్రాణాలు పోతే తిరిగి తెచ్చుకోలేము ఆ బాధ అయితే నాకు ఉంటుంది కానీ చనిపోతే ఏడవాలని రూల్ ఎక్కడ లేదు.ఇక సౌందర్య చనిపోయినప్పుడు నేను ఏడవలేదు కానీ సౌందర్య తన సోదరుడు ఇద్దరు చనిపోయారు ఇప్పుడు తన సోదరుడి భార్య పిల్లలు అలాగే వాళ్ళ అమ్మ పరిస్థితి ఏంటి అనే విషయం గురించి ఆలోచించి చాలా బాధపడ్డానని జగపతిబాబు చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube