సాధారణంగా కొంతమందికి సింగింగ్, డ్యాన్సింగ్ వంటి కళలలో ఎంతో టాలెంట్ ఉంటుంది కానీ వారు మాత్రం పొట్టకూటి కోసం ఏదో ఒక చిన్న జాబులు చేసుకుంటూ బతుకుతారు.వీరిలోని ఆ హిడెన్ టాలెంట్ ఏదో ఒక సందర్భంలో బయటపడుతుంది.
దాన్ని చూస్తే మనం ఆశ్చర్యపోక తప్పదు.తాజాగా ఆఫీసులో ఖాళీగా ఉన్న ఓ మహిళ డ్యాన్స్( Dance ) చేస్తున్న వీడియో ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది.
వీడియో మొదట్లో ఆమె ఆఫీసులో క్లీన్ చేస్తున్న ఒక స్వీపర్( Sweeper ) లాగా కనిపిస్తుంది.ఇయర్‌ఫోన్‌లో ఎవరో చెప్పిన పనిని ఆమె జాగ్రత్తగా వింటుంది.
ఆ తర్వాత ఆమె శుభ్రం చేయడానికి ఓ గదిలోకి వెళ్తుంది.ముందుగా సోఫా శుభ్రం చేయడం మొదలుపెడుతుంది.కానీ, శుభ్రం చేస్తూ చేస్తూ, ఉన్నట్టుండి అద్భుతమైన డ్యాన్స్ స్టెప్ వేస్తుంది.ఆ తర్వాత పని చేస్తూనే, మధ్య మధ్యలో డ్యాన్స్ చేస్తూ వెళ్తుంది.
ఆమె ప్రతి డ్యాన్స్ స్టెప్ లోనూ అద్భుతమైన పనితనం చూస్తే, శిక్షణ పొందిన డ్యాన్సర్ అయి ఉండవచ్చని అనిపిస్తుంది.డాన్స్ లో ఇంత టాలెంట్ కలిగి ఉండి ఆమె ఏదైనా డాన్స్ స్కూల్ పెట్టుకోవచ్చు కదా అని మనం అనుకోక తప్పదు చాలా గ్రేట్ ఫుల్ గా ఒక ప్రొఫెషనల్ డాన్సర్( Professional Dancer ) లాగానే ఈమె డాన్స్ చేసింది.

చూసేందుకు హీరోయిన్ ఫిగర్ లాగా కనిపించింది.కానీ ఎందుకో ఆమె ఆఫీసులో ఒక స్వీపర్ గానే పనిచేస్తుంది.బహుశా ఆర్థికంగా ఆమె ఇబ్బందులు ఎదుర్కొంటుందేమో, పేదరికంలో పుట్టిందేమో అని చాలామంది రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.వీడియో మరో భాగంలో, నేలను మాప్‌తో శుభ్రం చేస్తూ, మూన్‌వాక్ స్టెప్( Moonwalk Step ) కూడా వేస్తుంది.
చివరిగా పనికి కాస్త బ్రేక్ తీసుకుని, ఐటిజి అనే మ్యూజిక్ గ్రూప్ పాటకు డాన్స్ చేయడం మొదలు పెడుతుంది.ఆఫీసు అంతా ఉన్న సీసీటీవీ కెమెరాలు ఆమె డాన్స్ చేస్తున్న వీడియోను రికార్డ్ చేశాయి.

ఆ తర్వాత ఆఫీసులోకి ఓ వ్యక్తి వస్తాడు.ఆ అమ్మాయి డ్యాన్స్ చేస్తుండటం చూసి ఆశ్చర్యపోతాడు.అతను చూసి ఆమె కూడా కాస్త టెన్షన్ పడుతుంది.కానీ, ఆ వ్యక్తి ఆమె డాన్స్‌ని చూసి చప్పట్లు కొట్టి మెచ్చుకోవడంతో, మళ్లీ రిలాక్స్ అవుతుంది.ఈ వైరల్ వీడియోను మీరు కూడా చూసేయండి.







