పిల్లలకు మద్యం,పొగాకు ఉత్పత్తులు అమ్మవద్దు: ఎస్పీ రాహుల్ హెగ్డే

సూర్యాపేట జిల్లా:పిల్లలకు మద్యం,పొగాకు ఉత్పత్తులు విక్రయించడం,బహిరంగంగా మద్యం తాగడం,ధూమపానం (సిగరెట్) చేయడం లాంటివి చట్టరీత్య నేరమని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే( SP Rahul Hegde ,) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలపై జిల్లా వ్యాప్తంగా నిఘా ఉంచామని, అక్రమ సిట్టింగ్లు,బహిరంగంగా మద్యం,సిగరెట్ తాగడం లాంటి అసాంఘిక చర్యలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని హెచ్చరించారు.

 Do Not Sell Alcohol And Tobacco Products To Children: Sp Rahul Hegde-TeluguStop.com

ఇలాంటివి చూసి వాటికి పిల్లలు అలవాటుపడి తప్పుడు మార్గంలోకి వెళ్ళే అవకాశం ఉన్నదని గుర్తు చేశారు.ప్రతి ఒక్కరికీ సామాజిక బాధ్యత ఉండాలని,ఇలాంటివి బహిరంగంగా చేయడం మానుకోవాలని సూచించారు.

మైనర్ పిల్లలకు మద్యం, పొగాకు ఉత్పత్తుల లాంటి మత్తు పదార్థాలను అమ్మవద్దు అని హెచ్చరించారు.వీటి వల్ల పిల్లలు చెడు వ్యసనాలకు అలవాటు పడి నేరాలకు పాల్పడే అవకాశం ఉన్నదని, పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుందని గుర్తు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube