1,70,000 సింగపూర్( Singapore) డాలర్ల విలువైన మాంసం ఉత్పత్తులను దొంగిలించిన కేసులో భారత సంతతికి చెందిన డెలివరీ డ్రైవర్‌కు సింగపూర్ కోర్టు సోమవారం 30 నెలల జైలు శిక్ష విధించింది.హోల్‌సేల్ డిస్ట్రిబ్యూటర్‌తో పనిచేస్తున్నప్పుడు అతను ఈ దొంగతనాలకు పాల్పడినట్లుగా విచారణలో తేలింది.
నిందితుడిని శివం కరుప్పన్ (42)గా గుర్తించారు.ఇతను దొంగిలించిన మాంసాన్ని ఒక కస్టమర్‌కు విక్రయించి వచ్చిన మొత్తాన్ని ‘ చీ సాంగ్ ఫుడ్స్ ’తో కలిసి పనిచేస్తున్న మరో సహోద్యోగి కలిసి పంచుకున్నట్లుగా టుడే వార్తాపత్రిక నివేదించింది.
సహోద్యోగిపై కేసుకు సంబంధించి కోర్టులో విచారణ జరగాల్సి వుంది.కరుప్పన్‌తో కలిసి సహ నిందితుడిగా ఉన్న వ్యక్తిని భారత సంతతికి చెందిన నేషన్ గుణసుందరం (27)( Neshan Gunasundram )గా గుర్తించారు.
ఇతను కంపెనీ గిడ్డంగిలో సూపర్‌వైజర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు.గిడ్డంగి లోపల, వెలుపల వస్తువుల రాకపోకలను పర్యవేక్షించడం ఇతని విధి.
అలాగే ఇతర కార్మికులకు సరైన పరిమాణంలో మాంసం ఉత్పత్తులను లోడ్ చేయడం , వాటిని వినియోగదారులకు డెలివరీ చేయడం వంటి అంశాలపై గుణసుందరం మార్గనిర్దేశం చేయాల్సి ఉంటుంది.
2021 మే నెలలో కరుప్పన్.కంపెనీ కస్టమర్‌లలో ఒకరైన జీవీ మీట్ డిస్ట్రిబ్యూటర్ సిబ్బందితో ముచ్చట్లు పెట్టాడు.ఈ సందర్భంగా తక్కువ ధరకు అదనపు మాంసం దొరుకుతుందా అని ఓ వ్యక్తి కరుప్పన్‌ను అడిగాడు .అంతేకాదు .మాంసం కొనేందుకు నేరుగా కరుప్పన్‌కు డబ్బులిచ్చాడు.కంపెనీ నుంచి మాంసం ఉత్పత్తులను దొంగిలించి నేరుగా కస్టమర్‌కు విక్రయించగా వచ్చిన మొత్తాన్ని పంచుకోవాలని ఇద్దరు కుట్రకు తెరదీశారు.
2022 జనవరి 4 నుంచి జూలై 15 మధ్య 34 సందర్భాలలో కరుప్పన్( Sivam Karuppan).కస్టమర్‌తో నేరుగా మాట్లాడేవాడని కోర్టు పేర్కొంది.తనకు ఎంత మాంసం అవసరమో అతను చెబితే.
కరుప్పన్ ఈ సమాచారాన్ని గుణసుందరానికి తెలియజేసేవాడు.కస్టమర్ కంపెనీకి ఆర్డర్ చేసినప్పుడల్లా .ఆ పరిమాణాలను, అలాగే కరుప్పన్ ద్వారా నేరుగా ఆర్డర్ చేసిన అదనపు మాంసం ఉత్పత్తులను లోడ్ చేయమని గుణసుందరం కార్మికులను ఆదేశించేవాడు.ఈ విధంగా కరుప్పన్, గుణసుందరం మొత్తం 1,70,059.77 సింగపూర్ డాలర్ల విలువైన మాంసం ఉత్పత్తులను దొంగిలించారని కోర్టు పత్రాలు తెలిపాయి.ఈ క్రమంలో జూలై 23, 2022న కంపెనీలోని ఆపరేషన్స్ అండ్ లాజిస్టిక్స్ మేనేజర్ ఎడ్డీ లోహ్ అంతర్గత తనిఖీలు నిర్వహించి దొంగతనాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కస్టమర్లు ఆర్డర్ చేసిన పరిమాణాలకు, డెలివరీ కోసం లోడ్ చేయబడిన పరిమాణాలకు మధ్య పొంతన లేకపోవడాన్ని లోహ్ గుర్తించారు.యజమాని పెట్టుకున్న నమ్మకాన్ని కరుప్పన్ దుర్వినియోగం చేశాడని.
అతను చేసిన నేరాలకు 32 నుంచి 38 నెలల జైలు శిక్ష విధించాల్సిందిగా డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రోనీ ఆంగ్ కోర్టును కోరారు.అయితే హెచ్‌సీ లా ప్రాక్టీస్‌కు చెందిన డిఫెన్స్ న్యాయవాది ఫు హో చ్యూ మాట్లాడుతూ.
కరుప్పన్ బస్‌స్టాప్‌లు, ఖాళీ డెక్‌లో నివసిస్తూ కష్టాల్లో ఉన్నాడని తెలిపారు.నేరం రుజువుకావడంతో కరుప్పన్‌కు ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా రెండు విధించవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు.