యాదాద్రి భువనగిరి జిల్లా: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో నిత్య కళ్యాణం,హోమం, జోడు సేవలు వివిధ ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు తప్పని సరిగా సంప్రదాయ దుస్తులు ధరించాలని ఆలయ ఈవో భాస్కర్ రావు ఓప్రకటనలో తెలిపారు.ఆలయంలో జూన్1వ,తేదీ నుంచి నియమాలు ఖచ్చితంగా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానము తరహాలోనే యాదాద్రిలో కూడా విఐపి బ్రేక్ దర్శనానికి కూడా డ్రెస్ కోడ్ భక్తులు తప్పనిసరిగా పాటించవలసి వస్తుందని తెలిపారు.స్వామి వారి బ్రేక్ దర్శనానికి వచ్చే భక్తులకు తప్పనిసరిగా ఈ నిబంధన వర్తిస్తుందన్నారు.
సాధారణ ధర్మ దర్శనం క్యూ లైన్ లో వచ్చే భక్తులు,ఈ నియమం వర్తించదని,ఈ విషయంపై భక్తులందరూ సహకరించాల్సిందిగా కోరారు.







