డార్క్ సర్కిల్స్.( Dark Circles ) మనలో ఎంతో మంది కామన్ గా ఫేస్ చేసే సమస్యల్లో ఇది ఒకటి.
కళ్ళ చుట్టూ ఏర్పడే డార్క్ సర్కిల్స్ ముఖ సౌందర్యాన్ని దెబ్బ తీస్తాయి.ముఖంలో మెరుపును దూరం చేస్తాయి.
ఈ క్రమంలోనే డార్క్ సర్కిల్స్ ను వదిలించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే ఐ మాస్క్( Eye Mask ) మీకు చాలా బాగా సహాయపడుతుంది.రోజు నైట్ ఈ ఐ మాస్క్ వేసుకుంటే డార్క్ సర్కిల్స్ కి శాశ్వతంగా గుడ్ బై చెప్పవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఐ మాస్క్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పావు టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్( Coffee Powder ) వేసుకోవాలి.అలాగే చిటికెడు పసుపు,( Turmeric ) వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ మరియు రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్( Aloevera Gel ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే వారం రోజుల పాటు వాడుకోవచ్చు.
నైట్ నిద్రించే ముందు మేకప్ ఏమైనా ఉంటే తొలగించి ముఖాన్ని వాటర్ తో శుభ్రంగా వాష్ చేసుకోవాలి.
ఆపై తడి లేకుండా తుడుచుకుని.తయారు చేసుకున్న మిశ్రమాన్ని కళ్ళు చుట్టూ అప్లై చేసుకోవాలి.పూర్తిగా ఆరిన తర్వాత నిద్రించాలి.
ఉదయాన్నే గోరువెచ్చని నీటితో ఐ మాస్క్ ను తొలగించాలి.నిత్యం ఈ ఐ మాస్క్ ను కనుక వేసుకుంటే కళ్ళ చుట్టూ ఏర్పడిన నల్లటి వలయాలు క్రమంగా మాయం అవుతాయి.
డార్క్ సర్కిల్స్ ను నివారించడానికి ఈ ఐ మాస్క్ చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.కాబట్టి నల్లటి వలయాలతో బాధపడుతున్న వారు తప్పకుండా నిత్యం ఈ ఐ మాస్క్ వేసుకునేందుకు ప్రయత్నించండి.