తిరుమల స్వామివారిని దర్శించుకున్న చంద్రబాబు..!!

ఏపీలో శనివారంతో ఎన్నికల ప్రచారం ముగిసింది.ఈ ఎన్నికలలో ప్రచారానికి ఆఖరి రోజు కావడంతో చంద్రబాబు ప్రజాగళం సభను చిత్తూరులో నిర్వహించారు.

సభలో వైసీపీ ప్రభుత్వంపై సీఎం జగన్ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.చివరి రోజు కావడంతో ఉద్వేగపూరితంగా ప్రసంగం చేశారు.

ఈ బహిరంగ సభ ముగించుకున్న అనంతరం చంద్రబాబు తిరుమల వెళ్లారు.సాంప్రదాయ దుస్తులు ధరించి స్వామి వారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ వర్గాలు తీర్థప్రసాదాలు అందజేశాయి.చంద్రబాబు రాకతో ఆలయం వద్ద సందడి నెలకొంది.

క్యూలైన్లో ఉన్న భక్తులకు చంద్రబాబు అభివాదం చేశారు.

చంద్రబాబు తిరుమల పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది.తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రేణిగుంట ఎయిర్ పోర్ట్ కి వెళ్లడం జరిగింది.2024 ఎన్నికలను చంద్రబాబు చాలా సీరియస్ గా తీసుకున్నారు.ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పడం జరిగింది.గెలుపే లక్ష్యంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా పొత్తులు పెట్టుకున్నారు.బీజేపీ, జనసేన పార్టీలతో కలసి పోటీ చేస్తున్నారు.ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల విషయంలో చాలా హోం వర్క్ చేసినట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదా విభజన జరిగిన తర్వాత రెండు ఎన్నికలలో ఎన్నడూ చేయని వర్క్ చేసి అభ్యర్థులను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.2019 ఎన్నికలలో టీడీపీ ఓటమిపాలైంది.కానీ ఈసారి ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించాలని చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube