నల్గొండ – ఖమ్మం – వరంగల్ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరును బీజేపీ (BJP) ప్రకటించింది.ఈ మేరకు గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డిని బరిలో దించుతున్నట్లు తెలిపింది.
ఈ నేపథ్యంలో రేపు నల్గొండలో ప్రేమేందర్ రెడ్డి (Premender Reddy) నామినేషన్ దాఖలు చేయనున్నారు.అయితే వరంగల్ -ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి ఈ నెల 27వ తేదీన శానసమండలి ఉప ఎన్నిక జరగనుంది.
బీఆర్ఎస్ (BRS) పార్టీ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy) ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఖాళీ కావడంతో ఆ స్థానానికి ఈసీ షెడ్యూల్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే.