తెలంగాణ బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతు అయిందని ప్రధాని మోదీ అన్నారు. కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్(Bandi Sanjay) కు మద్ధతుగా ఆయన వేములవాడలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు.
అవినీతిలో కాంగ్రెస్, బీఆర్ఎస్(Congress, BRS) రెండూ ఒక్కటేనని మోదీ ఆరోపించారు.కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం(Kaleswaram) గురించి ఆరోపణలు చేశారన్న మోదీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు.
ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం తప్ప చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే కరీంనగర్ లో బీజేపీ విజయం ఖాయమని స్పష్టం చేశారు.
ఇక హైదరాబాద్ లో ఎంఐఎంను గెలిపించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ సహకరిస్తున్నాయని తెలిపారు.







