బ్రిటన్ అంగారక గ్రహం( Britain is Mars ) మీదకు ఓ అద్భుతమైన అంతరిక్ష ప్రయాణానికి సిద్ధమవుతోంది.అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (NASA)తో పాటు ఇతర దేశాలు కూడా ఇప్పటికే అంగారక గ్రహానికి రోవర్లు, ల్యాండర్లు పంపించగా, ఇప్పుడు బ్రిటన్ కూడా ఈ రేస్‌లో చేరింది.
యూకే ఎక్సోమార్స్ రోవర్ పరీక్షలు మొదలుపెట్టింది.బ్రిటన్ ఇక్కడే భూమి మీద అంగారక గ్రహం వాతావరణాన్ని పోలి ఉండే అద్భుతమైన ప్రదేశాన్ని సృష్టించింది.
అంగారక గ్రహాన్ని పోలి ఉండే ఎర్రటి ఇసుక, రాళ్లను ఉపయోగించి స్టీవెనీజ్‌లో ఒక ప్రయోగశాలను నిర్మించింది.

2028లో జరిగే అంగారక గ్రహ పరిశోధనలో భాగంగా ఎక్సోమార్స్ రోవర్‌ను ( ExoMars rover )పరీక్షించడమే లక్ష్యంగా ఈ మార్స్ కార్బన్ కాపీ క్రియేట్ చేశారు.ఈ రోవర్ అంగారక గ్రహం మీద నీటిని, జీవరాశులు ఉండే అవకాశాలను వెతుకుతుంది.2028లో ఎక్సోమార్స్ రోవర్‌ను మోసుకెళ్లే అంతరిక్ష నౌక అంగారక గ్రహాన్ని అన్వేషించడం, దాని రహస్యాలను తెలుసుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది.

అంగారక గ్రహంపై జీవరాశులు( organisms ) ఉండే అవకాశం ఉందని లేదా కనీసం వాటి ఉనికికి సంబంధించిన చిహ్నాలు దొరుకుతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.ఎయిర్‌బస్ సంస్థ 3,500 మంది ఉద్యోగుల బృందం తో కలిసి స్టీవెనీజ్‌లో ఎక్సోమార్స్ రోవర్‌ను నిర్మించింది.అంగారక గ్రహం ఉపరితలంపై రోవర్‌ను సురక్షితంగా దించే ల్యాండర్‌ను రూపొందించడంలో కూడా వారు పాల్గొంటున్నారు.ఈ యూకే అంతరిక్ష ప్రాజెక్ట్ ప్రతి సంవత్సరం ఆర్థిక వ్యవస్థకు £17.5 బిలియన్ల (సుమారు రూ.183 కోట్లు) భారీ మొత్తాన్ని అందిస్తుంది.యూకే పరిశోధకులు అంగారక గ్రహంపై జీవరాశి ఉన్నట్లు కనిపెడతారా లేదా అనేది తెలియాలంటే కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే.ప్రస్తుతానికి వేరే ప్రాజెక్టు హాట్ టాపిక్ గా మారింది.







