తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాస్ మహారాజ్ గా రవితేజ( Ravi Teja ) తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు.ఇక ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీ లో సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.
ఇక ప్రస్తుతం రవితేజ చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అయిన ఫ్లాప్ అయిన ఆ సినిమాకి రావాల్సిన గుర్తింపు అయితే వస్తుంది.
అలాగే ప్రొడ్యూసర్స్ ( Producers )కూడా సేఫ్ జోన్ లో ఉంటున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన హరీష్ శంకర్ ( Harish Shankar )డైరెక్షన్ లో మిస్టర్ బచ్చన్( Mr.Bachchan ) అనే సినిమా చేస్తున్నాడు.ఇక ఆయన ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది.ఇక మొత్తానికి ఈ సినిమాతో రవితేజ సక్సెస్ కొట్టినట్టైతే భారీగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఇక నిజానికి ఇప్పుడున్న స్టార్ హీరోలందరూ మొదటి సినిమా చేస్తున్న సమయంలోనే రవితేజ స్టార్ హీరోగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.అయినప్పటికీ తను ఇంకా ఇప్పటికీ కూడా మీడియం రేంజ్ హీరో గానే ఉండడానికి గల కారణం ఏంటి అనే విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
అయితే మధ్యలో ఆయన తన మార్కెట్ ను పెంచుకోవడానికి ప్రయత్నం చేయకపోవడమే దానికి ముఖ్య కారణమని మరి కొందరు చెబుతున్నారు.తన మార్కెట్ ని అంచనా వేయకుండా ఏ డైరెక్టర్ పడితే ఆ డైరెక్టర్ తో సినిమాలు చేస్తూ ముందుకు సాగడం వల్లే రవితేజ ఇప్పుడు టైర్ టు హీరోగా కొనసాగుతున్నాడు కానీ స్టార్ హీరోగా మాత్రం కొనసాగలేకపోతున్నాడు.స్టార్ హీరోలకు తో పోలిస్తే ఆయన వెనుకబడడానికి గల కారణం కూడా ఇదే అని చాలా మంది చెబుతున్నారు…
.