రాజమండ్రి రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరికి( Gorantla Butchaiah Chowdary ) నిరసన తెగ తగిలింది.ఈ మేరకు 27వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా స్థానికులు ఆయనను అడ్డుకున్నారు.
ఎమ్మెల్యేగా విజయం సాధించినప్పటి నుంచి తమ వార్డును గోరంట్ల బుచ్చయ్య చౌదరి పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు.ఐదేళ్లుగా తమ వార్డులో ఎలాంటి అభివృద్ధి జరగలేదని మహిళలు నిరసనకు( Women Protest ) దిగారు.
ఈ క్రమంలో ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి, వార్డులోని మహిళలకు మధ్య వాగ్వివాదం చెలరేగింది.దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.మరోవైపు అభివృద్ధి జరగలేదని నిలదీసినందుకు గోరంట్ల తమను చెప్పుతో కొడతానంటూ బెదిరింపులకు పాల్పడ్డారని మహిళలు ఆరోపిస్తున్నారు.ఈ క్రమంలోనే టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల వ్యాఖ్యలపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తామని మహిళలు చెబుతున్నట్లు సమాచారం.







