బీఆర్ఎస్ నేత క్రిశాంక్( Krishank ) ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.ఈ మేరకు రెండు రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని పోలీసులు పిటిషన్ లో కోరారు.
మరోవైపు క్రిశాంక్ కు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కోర్టులో మరో పిటిషన్ దాఖలైంది.కాగా ఈ రెండు పిటిషన్లపై హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టులో( Nampally Court ) ఇవాళ విచారణ జరగనుంది.
అయితే ఫేక్ సర్క్యులర్ ( Fake circular )ను సర్క్యులేట్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో భాగంగా క్రిశాంక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.కాంగ్రెస్ ఫిర్యాదు మేరకు క్రిశాంక్ పై ఐపీసీ సెక్షన్ల 466, 468, 469, 505 (1) కింద పోలీసులు కేసు నమోదు చేశారు.