అప్పులు చేసి చదువు.. ఒక్క మార్కుతో ఫెయిల్.. జోయా మీర్జా సక్సెస్ స్టోరీకి హ్యాట్సాఫ్ అనాల్సిందే!

ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సక్సెస్ సాధించాలని ఉన్నత స్థితికి చేరుకోవాలని కలలు కంటారు.అయితే లక్ష్యాలను సాధించడం కలలు కన్నంత సులువు కాదు.

 Zoya Mirza Inspirational Success Story Details Here Goes Viral In Social Media ,-TeluguStop.com

ఎన్నో అవరోధాలు ఎదురైనా వాటిని అధిగమించి తీవ్రస్థాయిలో శ్రమిస్తే మాత్రమే లక్ష్యాలను సాధించడం సాధ్యమవుతుంది.జోయా మీర్జా ( Zoya Mirza )అనే యువతి తను కన్న కలలను నెరవేర్చుకోవడంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

ఎన్నోసార్లు ఆమెకు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యాయి.

అయితే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని పట్టించుకోకుండా ముందడుగులు వేస్తూ జోయా మీర్జా సత్తా చాటారు.

ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ డాక్టర్ ( Dr.Lt.in Indian Army )గా ఎంపికైన జోయా మీర్జా చత్తీస్ గఢ్ నుంచి ఈ ఘనత సాధించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు.చతీస్ గఢ్ రాష్ట్రంలోని దుర్గ్ జిల్లాకు( Durg district of Chhattisgarh state ) చెందిన జోయా మీర్జా వైద్యురాలిగా సేవ అందించాలని సైన్యంలో పని చేయాలని కలలు కన్నారు.

Telugu Dr Lt Indian, Neet Exam, Zoya Mirza, Zoyamirza-Movie

అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ కలను నెరవేర్చుకోవడంలో ఆమెకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి.నీట్ పరీక్షలో కూడా ఆమెకు ఫెయిల్యూర్ ఎదురైంది.తల్లీదండ్రులు అప్పులు చేసి మరీ ఈమెను చదివించారు.

ఒకే ఒక్క ర్యాంక్ తేడాతో జోయా మీర్జా సీటు సాధించే అవకాశాన్ని కోల్పోయారు.ఆమెకు ఫెయిల్యూర్ ఎదురైనా కుటుంబ సభ్యులు మాత్రం తమ వంతు సహాయం చేస్తూ వచ్చారు.

Telugu Dr Lt Indian, Neet Exam, Zoya Mirza, Zoyamirza-Movie

ఖిలాయ్ కోచింగ్ సెంటర్ లో చేరిన జోయా మీర్జా జోయా మీర్జా ఆత్మ విశ్వాసం పెంచుకుని నీట్ పరీక్షలో సక్సెస్ అయ్యారు.ఎంబీబీఎస్ పూర్తి చేసిన మీర్జా ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ డాక్టర్ గా పని చేస్తున్నారు.ఫెయిల్యూర్స్ కూడా లైఫ్ లో భాగమేనని వాటిని పట్టించుకోకుండా కష్టపడితే లైఫ్ లో ఉన్నత స్థాయికి ఎదగవచ్చని జోయా మీర్జా సక్సెస్ స్టోరీతో అర్థమవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube