ప్రపంచంలో ప్రతిరోజు అనేక రకాల సంఘటనలు జరుగుతూ ఉంటాయి.ప్రతి విషయం సోషల్ మీడియా ద్వారా మనకి నిమిషాల వ్యవధిలో ఆ విషయాలను తెలుసుకుంటూ ఉంటాము.
అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అనేక రకాల వైరల్ వీడియోలు చూస్తూ ఉండటం సహజమే.అందులో అనేక రకాల వీడియోలు వైరల్ గా మారుతుంటుంటే ఈ మధ్యకాలంలో జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారడం ఎక్కువగా గమనిస్తున్నాం.
ఇకపోతే తాజాగా ఒక రద్దీగా ఉన్న రోడ్లపై రెండు ఆర్మీ గుర్రాలు( Army horse) పరిగెత్తడం ఇప్పుడు వైరల్ గా మారింది.ఇప్పుడు ఈ వీడియోకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.

వైరల్ గా మారిన వీడియోలో గమనించినట్లయితే.ఓ రెండు ఆర్మీ గుర్రాలు రోడ్లపై పరిగెత్తడం కనపడుతుంది.కాకపోతే ఆ రెండింటికి కాస్త గాయాలు అయినట్లు కూడా అందులో కనబడుతుంది.ఈ రెండు గుర్రాలు బ్రిటన్ ప్రభుత్వం( Britain Government)లోని ఆర్మీకి సంబంధించిన గుర్రాలు.అలా తప్పించుకపోయినా గుర్రాలు ఇప్పటికి అధికారులు కనిపెట్టలేకపోయారు.నిజానికి బ్రిటన్ దేశంలో అనేక రకాల గుర్రాలు అందుబాటులో ఉంటాయి.
వాటికోసం ప్రత్యేకంగా గుర్రపు శాలలు కూడా అనేకంగా ఉన్నాయి.మరి ముఖ్యంగా కొన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద కూడా అధికారులు గుర్రాలను ఏర్పాటు చేయడం అక్కడ గమనించవచ్చు.
లేకపోతే ఆర్మీ( Army)లో గుర్రాలు తప్పిపోయిన తర్వాత ఆర్మీ అధికారులు లండన్ నగరంలోని పోలీసులకు ఫోన్ చేసి అసలు విషయాన్ని తెలిపారు./br>

ఆర్మికు సంబంధించిన రెండు గుర్రాలు తప్పిపోయానని చెప్పగా ఒకవైపు నగర పోలీసులు మరోవైపు ఆర్మీ అధికారులు రెండు గుర్రాలను వెతికే పనిలో నిమగ్నమయ్యారు.ఇలా మొత్తంగా ఐదు గుర్రాలు ఆర్మీ క్యాంపుకు కొత్తగా రావడంతో అవి కాస్త మాట వినకపోవడం కారణంగా అందులోని రెండు గుర్రాలు ఆర్మీ అధికారులు డ్రిల్ చేపిస్తుండగా వాటిపై కూర్చున్న అధికారలను కింద పడేసి అక్కడి నుంచి పారిపోయినట్లు అధికారులు తెలిపారు.గుర్రాలపై పడిన ఓ ఆర్మీ అధికారికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు







