హత్య కేసులో పరారీ .. కెనడా మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో భారత సంతతి వ్యక్తి

డిసెంబర్ 2022లో జరిగిన భారత సంతతికి చెందిన 21 ఏళ్ల పవన్‌ప్రీత్ కౌర్( Pawanpreet Kaur ) హత్యలో ప్రమేయం వున్న ఇండో కెనడియన్‌ను అక్కడి పోలీసులు మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చారు. ‘‘ బీ ఆన్ ది లుకౌట్ ’’ లేదా ‘‘ బోలో ప్రోగ్రాం ’’ మంగళవారం విడుదల చేసిన కెనడాలోని 25 మంది మోస్ట్ వాంటెడ్ జాబితాలో పరారీలో వున్న ధరమ్ సింగ్ ధాలివాల్‌ను( Dharam Singh Dhaliwal ) చేర్చారు.

 Indo-canadian Fugitive Listed Among Canadas Most Wanted Details, Indo-canadian F-TeluguStop.com

ధాలివాల్‌ను అరెస్ట్ చేసేందుకు కావాల్సిన సమాచారం అందజేసినవారికి 50 వేల కెనడియన్ డాలర్ల రివార్డ్‌ను ప్రకటించారు.బోలో తీవ్రమైన నేరాలకు పాల్పడిన వ్యక్తులపై దృష్టి పెడుతుంది.

మోస్ట్ వాంటెడ్ వ్యక్తులను వెతకడానికి పౌరులను ప్రోత్సహించడానికి సోషల్ మీడియా, సాంకేతికతను బోలో ప్రభావితం చేస్తుంది.

Telugu Lookout, Canadas, Dharamsingh, Greatertoronto, Indocanadian, Pawanpreet K

బాధితురాలు గ్రేటర్ టొరంటో ఏరియా (జీటీఏ)లోని బ్రాంప్టన్ నివాసి.ఆమె డిసెంబర్ 3, 2022న రాత్రి 9 గంటల ప్రాంతంలో పెట్రో కెనడా గ్యాస్ స్టేషన్( Petro-Canada Gas Station ) వెలుపల కాల్పులకు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.ఈ హత్యకు సంబంధించి గతేడాది ఏప్రిల్‌లో ధాలివాల్‌పై కెనడా వ్యాప్తంగా అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.

పీల్ రీజినల్ పోలీస్ (పీఆర్‌పీ) చీఫ్ నిషాన్ దురైయప్ప తాజాగా ధాలివాల్‌ను మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో చేర్చినట్లు పేర్కొన్నారు.గతేడాది ఏప్రిల్‌లో విడుదల చేసిన పీఆర్‌పీ హోమిసైడ్ బ్యూరో రిపోర్టులో 31 ఏళ్ల ధాలివాల్‌పై ఫస్ట్ డిగ్రీ హత్య నేరానికి అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లు తెలిపింది.

ధరమ్ ధాలివాల్ సెప్టెంబర్ 2022లో ఉద్దేశ్యపూర్వకంగా కనిపించకుండా పోయాడు.

Telugu Lookout, Canadas, Dharamsingh, Greatertoronto, Indocanadian, Pawanpreet K

ధాలివాల్ 5 అడుగుల 8 అంగుళాల పొడవు, 170 పౌండ్ల బరువు, ఎడమ చేతిపై పచ్చబొట్టు వున్నట్లుగా పోలీసులు వివరించారు.అతను సాయుధుడని ప్రమాదకరమైన వ్యక్తిగా పరిగణించాలని, ధాలివాల్‌ను గుర్తించినట్లయితే తక్షణం పోలీసులను సంప్రదించాలని కోరారు.మరోవైపు నిందితుడి కుటుంబ సభ్యులలో ఇద్దరిని గతేడాది ఏప్రిల్ 18న న్యూ బ్రున్స్‌విక్‌లోని మోంక్షన్‌లో అదుపులోకి తీసుకున్నారు.

వారిని 25 ఏళ్ల ప్రిత్‌పాల్ ధాలివాల్, 50 ఏళ్ల అమర్‌జిత్ ధాలివాల్‌గా పేర్కొన్నారు.అరెస్ట్ నుంచి ధాలివాల్‌కు సహాయం చేసే ఎవరైనా సరే అదే రకమైన అభియోగాలను ఎదుర్కొంటారని పోలీసులు హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube