తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ( Chandrababu ) చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఎంకే మీనా సిఫార్సు చేశారు.విషయంలోకి వెళ్తే ఇటీవల బహిరంగ సభలలో ముఖ్యమంత్రి జగన్ పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ( YCP ) ఫిర్యాదు చేయడం జరిగింది.
ఈ క్రమంలో చంద్రబాబుకి ఈసీ నోటీసులు జారీ చేసి వివరణ ఇవ్వాలని కోరడం జరిగింది.దీంతో చంద్రబాబు వివరణ ఇచ్చారు.
ఆయన ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందని సీఈఓ మీనా( CEO Meena ).తదుపరి చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.
ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు ప్రసంగాలకు క్లిప్పింగ్ లను జత పరిచారు.ఏపీలో ఎన్నికలకు ఇంకా 20 రోజులు మాత్రమే సమయం ఉంది.ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్ పర్వం సాగుతోంది.ఇదే సమయంలో ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీల నేతలు బిజీబిజీగా గడుపుతున్నారు.తెలుగుదేశం పార్టీ ( Telugu Desam Party )అధినేత చంద్రబాబు “ప్రజాగళం” పేరిట ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ సభలకు కూడా హాజరవుతున్నారు.
ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ముఖ్యమంత్రి జగన్ పై తనదైన శైలిలో చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తున్నారు.ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం సీఎం జగన్ పై.బహిరంగ సభలో చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వైసీపీ.నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఎంకే మీనాకి ఫిర్యాదు చేయడం జరిగింది.