ఎన్నికల కురుక్షేత్రంలో ఒకే ఒక్కడుగా పోరాటం..: సీఎం జగన్

ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) నిర్వహిస్తున్న ‘ మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కొనసాగుతోంది.ఇందులో భాగంగా సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్ ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించారు.

 Fighting Alone In The Election Field..: Cm Jagan , Ap Cm Jagan, Cm Jagan Bus Y-TeluguStop.com

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో తాను ఒకే ఒక్కడుగా పోరాటం చేస్తున్నానని తెలిపారు.

జగన్ ఒక్కరు ఒకవైపు.చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్( BJP , Congress ) మరోవైపు అని చెప్పారు.

ప్రభుత్వ పథకాలు అందాయని ఆనందం వ్యక్తం చేసిన గీతాంజలిని దారుణంగా ట్రోల్ చేసి బలితీసుకున్నారని మండిపడ్డారు.

వ్యవస్థ ఎంత దిగజారిందనే దానికి గీతాంజలి బలవన్మరణమే నిదర్శనమని పేర్కొన్నారు.

సోషల్ మీడియా( Social media ) అంత తమతో ఉందన్నారు.సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ తనతోనే ఉన్నారని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే సోషల్ మీడియా కార్యకర్తలకు తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు.అదేవిధంగా కార్యకర్తలకు ఎంత చేసినా తక్కువేనని తెలిపారు.

సోషల్ మీడియా కార్యకర్తలకు వెనుక జగనే కాదు.యావత్ పార్టీ అంతా అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube