సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్.( Social Media Influencers ) ప్రస్తుత కాలంలో అన్ని రంగాల్లోనూ వీరి పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే.
న్యూస్ పేపర్లు, టీవీ ఛానళ్ల కంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ హవానే ఎక్కువగా ఉందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.సరికొత్త పుంతలు తొక్కుతూ సమాచారం వివిధ రూపాల్లో ప్రజలను చేరుతుండగా.
ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రత్యేక ఉనికిని చాటుకుంటున్నారు.అంతేకాదు వీరు షేర్ చేసే ప్రతి కంటెంట్, ప్రతి వీడియో చర్చనీయాంశంగా మారుతుంది.
అన్ని వర్గాలను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రభావితం చేయగలుగుతున్నారు.అంతేకాదు రాజకీయాల్లోనూ( Politics ) వీరి ప్రభావం ఎక్కువగానే ఉంది.ఇన్ఫ్లుయెన్సర్స్ పొలిటికల్ పార్టీలకు సంబంధించిన ప్రచారాలను నిర్వహిస్తే.ఎలాంటి పరిస్థితులు అయినా సరే మారడమే కాదు.
తమకు అనుకూలంగా ఫలితాలు ఉంటాయని పార్టీలు భావిస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు.వీరి ప్రభావం ఎంతనేది.
ఏపీలో త్వరలోనే లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు రానున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే పార్టీలు జనాల్లోకి విస్తృతంగా వెళ్తూ గెలుపు కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ‘ మేమంతా సిద్ధం’( Memantha Siddham ) పేరుతో బస్సు యాత్ర నిర్వహిస్తున్న వైసీపీ( YCP ) తాజాగా ఇన్ఫ్లుయెన్సర్స్ తో ప్రచారానికి రంగం సిద్ధం చేసింది.ఇందులో భాగంగా ఈ నెల 23వ తేదీన భీమిలిలో( Bheemili ) ఇన్ఫ్లుయెన్సర్స్ తో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనుంది.
అంతేకాదు ఈ సమావేశానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి సైతం వైసీపీకి అనుబంధంగా పని చేసే వారు హాజరుకానున్నారు.
భీమిలి వేదికగా జరిగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్ లో సీఎం జగన్( CM Jagan ) ప్రసంగించనున్నారు.ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారాలను ఎదుర్కొనడానికి ఇన్ఫ్లుయెన్సర్స్ సరైన సమాధానంగా నిలుస్తారని చెప్పుకోవచ్చు.వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ వారిని చైతన్య పరచడంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఈ క్రమంలోనే సామాజిక మాధ్యమాలతో పాటు సమాజాన్ని, జనాలను ప్రభావితం చేయగలిగే సోషల్ మీడియా నిర్వాహకులతో ఆయన సమావేశం కానున్నారు.దాంతో పాటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారికి దిశానిర్దేశం చేయనున్నారని సమాచారం.
అయితే.ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు( AP Elections ) సమీపిస్తున్న తరుణంలో ఉన్న సమయం పార్టీకి ఎంతో విలువైనది.ఉన్న అతి తక్కువ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు.ఈ క్రమంలో పార్టీని బలోపేతం చేయడానికి, వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి, అందించిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించే ప్రక్రియపై జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.
అదేవిధంగా రాజకీయ, సామాజిక ప్రాధాన్యత వంటి అంశాలను కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ఎలా కృషి చేయాలనే దానిపై చర్చించనున్నారు.దాంతో పాటు ప్రతిపక్ష పార్టీలు, వాటి అనుబంధ మీడియా చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పి కొట్టడం వంటి వాటిపై కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీటింగ్ లో చర్చ జరగనుందని సమాచారం.
వైసీపీ పాలనలో జరిగిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై నేతలంతా ఐక్యంగా నిర్ణయం తీసుకునేందుకు ఈ సమావేశం గొప్ప వేదికగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు.కాగా ఏపీలో వైసీపీపై, సీఎం జగన్ పై ఎలాంటి వ్యతిరేకత లేదు.
నవరత్నాలు అమలే కాకుండా మ్యానిఫెస్టోను 99 శాతం అమలు చేసిన జగన్ పాలనపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.విద్యా, వైద్యం వంటి ప్రముఖ రంగాల్లో వైసీపీ సర్కార్ చేసిన సంస్కరణలే కాకుండా ఇంటి వద్దకు సంక్షేమాన్ని అందించిన జగన్ ను మరోసారి ఆదరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం అవుతుందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ వాస్తవాలను, విషయాలను ప్రజల్లోకి మరింత లోతుగా తీసుకువెళ్లే విధంగా సీఎం జగన్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.ప్రస్తుతం భీమిలిలో ఏర్పాటు కానున్న ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.