వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికా( America )కు వెళ్తున్న భారతీయులు అక్కడ కీలక స్థానాలకు చేరుకుంటున్నారు.ఏళ్ల తరబడి అగ్రరాజ్యంలోనే నివసిస్తూ క్రమంగా అమెరికన్ పౌరులుగా మారిపోతున్నారు.
అంతేకాదు.ఆ దేశ పౌరసత్వం పొందుతున్న విదేశీయుల్లో భారతీయులు రెండో స్థానంలో నిలిచారు.2022 ఏడాదికి గాను దాదాపు 66 వేల మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం వచ్చినట్లు స్వతంత్ర కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ (సీఆర్ఎస్) వెల్లడించింది.2022లో మొత్తం 1,28,878 మంది మెక్సికన్లు అమెరికన్ పౌరులుగా మారి .జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు.ఆ తర్వాత భారత్ (65,960), ఫిలిప్పిన్స్ (53,413), క్యూబా (46,913), డొమినికన్ రిపబ్లిక్ (34,525), వియత్నాం (33,246), చైనా (27,038) నిలిచాయి.
కాగా.భారతదేశంలో పుట్టి అమెరికాలో నివసిస్తున్న వారిలో దాదాపు 42 శాతం మందికి అక్కడి పౌరసత్వం పొందే అర్హత లేదని నివేదిక పేర్కొంది.
అలాగే 2023 నాటికి గ్రీన్ కార్డ్, లీగల్ పర్మినెంట్ రెసిడెన్సీ( Legal Permanent Residency ) వున్న 2,90,000 మంది భారతీయులు నేచురలైజేషన్ సిటిజన్‌షిప్ పొందే అవకాశం వుందని సీఆర్ఎస్ తెలిపింది.
2022 నాటికి అమెరికాలో 33.3 కోట్ల జనాభా వుంటే.వారిలో విదేశీయులు 4.6 శాతం మంది వున్నారు.ఇది ఆ దేశ జనాభాలో 14 శాతానికి సమానం.వీరిలో 2.45 కోట్ల మంది తమని తాము నేచురలైజడ్ సిటిజన్స్‌గా ప్రకటించారు.ఇదిలావుండగా.నేచురలైజేషన్ సిటిజన్‌షిప్( Naturalization Citizenship ) కోసం వచ్చే దరఖాస్తుల సంఖ్య 2023 నాటికి 4,08,000గా వుంది.ఆ ఏడాది కొత్తగా 8,23,702 మంది నేచురలైజేషన్ విధానంలో అమెరికా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నట్లు నివేదిక తెలిపింది.ఈ పద్ధతిలో దాదాపు 90 లక్షల మంది వరకు అర్హత వున్నప్పటికీ తక్కువ సంఖ్యలో అప్లికేషన్లు వచ్చాయని సీఆర్ఎస్ వెల్లడించింది.
ఇకపోతే.అమెరికా వెళ్లాలనుకుంటున్న వారికి కీలకమైన హెచ్ 1, ఎల్ 1, ఈబీ 5 వంటి నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా రుసుములు( Immigrant Visa Charges ) పెరిగిన సంగతి తెలిసిందే.ఇమ్మిగ్రేషన్ విధానాలు , అంతర్జాతీయ సంబంధాలపై ప్రభావం చూపే వీసా సేవల్లో మార్పులు అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ( US Presidential Elections ) చర్చనీయాంశమైంది.హెచ్ 1 బీ , ఎల్ 1 , ఈబీ 5 అనేవి అమెరికాకు వలస వెళ్లేందుకు భారతీయులు పొందే వీసాలు.2016 నుంచి హెచ్ 1 బీ, ఎల్ 1, ఈబీ వీసా రుసుమును పెంచడం ఇదే తొలిసారి.పెరిగిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని అమెరికా ప్రభుత్వం పేర్కొంది.