ప్రభాస్ కి ఎక్కువగా కోపం తెప్పించే వ్యక్తి అతనేనా.. ఆయన వల్లే కోప్పడుతుంటాడా?

పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి టాలీవుడ్ హీరో ప్రభాస్ ( Prabhas )ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఉన్నారు.

 Senthil Is The Only Person To Irritate Prabhas , Prabhas ,rajamouli, Senthil,-TeluguStop.com

ఇకపోతే ఇటీవల ప్రభాస్ సలార్ సినిమా ( Salar Movie )ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇక ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకుంది.

ఇలా మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు వచ్చి రెండో భాగంపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేశారు.

Telugu Camera, Prabhas, Rajamouli, Salar, Senthil, Tollywood-Movie

ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఆధ్వర్యంలోనే కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.ఇక ప్రభాస్ వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన ఎప్పుడు చూడు చాలా ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటారు.ప్రభాస్ కి కోపం రావటం అనేది చాలా రేర్ అనే చెప్పాలి.

కానీ ప్రభాస్ కి తరచూ కోపం తెప్పించే వ్యక్తి ఒకరు ఉన్నారు అంటూ ఇటీవల రాజమౌళి (Rajamouli ) ఒక ఇంటర్వ్యూ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Telugu Camera, Prabhas, Rajamouli, Salar, Senthil, Tollywood-Movie

ఇందులో భాగంగా రాజమౌళితో ప్రభాస్ సినిమా కనుక చేస్తే ఒక వ్యక్తిపై ఎప్పుడూ కోప్పడుతూ ఉంటారని ఆ వ్యక్తి తనకు బాగా కోపం తెప్పించడంతోనే ప్రభాస్ కోప్పడుతూ ఉంటారంటూ రాజమౌళి తెలిపారు.మరి ప్రభాస్ కి కోపం తెప్పించే ఆ వ్యక్తి ఎవరు అనే విషయానికి వస్తే ఆయన మరెవరో కాదు కెమెరామెన్ సెంథిల్( Senthel ).వృత్తి పరంగా ఆయన నా కన్నా చాలా పర్ఫెక్ట్.ఆర్టిస్ట్ రెడీ అయ్యే టైంలో కూడా చెక్ చేసుకుంటాడు.అది ప్రభాస్‏కు కోపం తెప్పిస్తుంది.కోపం వచ్చినప్పుడు ప్రభాస్.ఏయ్ సెంథిల్.

ఏంత సేపయ్యా.ఎన్నాళయ్యా.

అంటాడు అంటూ చెబుతూ ప్రభాస్ వాయిస్‏తోపాటు మ్యానరిజం కూడ రాజమౌళి అచ్చుగుద్దినట్టు దించేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియో వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube