భారత మార్కెట్లో Xiaomi 14 Ultra స్మార్ట్ ఫోన్ సేల్ ప్రారంభం..!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ నుంచి Xiaomi 14 Ultra స్మార్ట్ ఫోన్( Xiaomi 14 Ultra Smartphone ) సేల్ భారత మార్కెట్లో ప్రారంభమైంది.ఈ ఫోన్ కు సంబంధించిన స్పెసిఫికేషన్, ధర వివరాలను తెలుసుకుందాం.Xiaomi 14 Ultra స్మార్ట్ ఫోన్: ఈ ఫోన్ 6.73 అంగుళాల LTPO AMOLED మైక్రో-కర్వ్ స్క్రీన్ తో ఉంటుంది.3200*1440పిక్సెల్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ బ్రైట్ నెస్ తో వస్తోంది.ఈ ఫోన్ షీల్డ్ గ్లాస్ తో వస్తుంది.

 Xiaomi 14 Ultra Smartphone Sale Started In India-TeluguStop.com

స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది.ఈ ఫోన్ గరిష్టంగా గరిష్టంగా 16GB వరకు LTDDR 5x RAM మరియు 1TB వరకు UFS 4.0 స్టోరేజ్ తో ఉంటుంది.ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్ OS లో పనిచేస్తుంది.

Telugu Xiaomi, Xiaomiultra, Xiaomi Ultra-Technology Telugu

కెమెరా విషయానికి వస్తే.ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్( Optical Image Stabilization ) తో కూడిన 1-అంగుళాల 50- మెగా పిక్సెల్ సోనీ LYT900 ప్రైమరీ కెమెరా సెన్సార్ తో వస్తుంది.మరొక రెండు మరొక్క రెండు అదనపు 50- మెగాపిక్సెల్ సోనీ IMX858 సెన్సార్లు 3.2X,5X యొక్క ప్రత్యేక ఆప్టికల్ జూమ్ సామర్థ్యాలను అందిస్తుంది.సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్ కెమెరా సెన్సార్ తో ఉంటుంది.

Telugu Xiaomi, Xiaomiultra, Xiaomi Ultra-Technology Telugu

ఈ ఫోన్ బ్యాటరీ విషయానికి వస్తే.5300mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి 90W వైర్ చార్జింగ్, 80W వైర్ లెస్, 10W రివర్స్ వైర్ లెస్ సామర్థ్యాలను కలిగి ఉంటుంది.అల్ట్రాసోనిక్ ఇన్- డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్( Ultrasonic In Display Fingerprint Censor ) మీ ఫోన్ కు భద్రత అందిస్తుంది.IP68 రేటింగ్ తో ఉంటుంది.ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే.16GB RAM+ 512GB స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర రూ.99999 గా ఉంది.HDFC, ICICI బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.5000 డిస్కౌంట్ ఆఫర్, ఎక్సేంజ్ బోనస్ ఆఫర్ గా రూ.5000 తగ్గింపు లభిస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్ Xiaomi అధికారిక వెబ్సైట్, ఫ్లిప్ కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube