టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) హీరోగా నటించిన తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్( Family star ).పరశురాం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్( Mrinal Thakur ) హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.
తాజాగా ఏప్రిల్ 5వ తారీఖున భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది.ఈ సినిమా కోసం నిర్మాత దిల్ రాజు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మరి ప్రత్యేకంగా ప్రమోషన్స్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
అయితే ఒక వర్గం ప్రేక్షకులు ఈ సినిమా సూపర్ గా ఉంది అని ఈ సినిమాపై పాజిటివ్గా స్పందిస్తుండగా మరికొందరు మాత్రం పనికట్టుకొని మరి సోషల్ మీడియాలో నెగిటివ్ గా ప్రచారం చేయడం మొదలుపెట్టారు.

విజయ్ దేవరకొండకు పేరు రాకూడదని ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్థమవుతుంది.ఇక ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ కు ముందే సినిమా మీద నెగిటివ్ పోస్టులు చేశారు కొందరు.దాంతో ఈ విషయాలు కాస్త.
ఫ్యామిలీ స్టార్’ సినిమా నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ( Sri Venkateswara Creations )దృష్టికి వెళ్లడంతో.నిర్మాణ సంస్ధ ఇచ్చిన సోషల్ మీడియా స్క్రీన్ షాట్స్, సోషల్ మీడియా గ్రూప్స్, ఇంకా అనేక అక్కౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా హీరో విజయ్ దేవరకొండ పర్సనల్ మేనేజర్ అనురాగ్ పర్వతనేని( Manager Anurag Parvataneni ) , విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నిషాంత్ కుమార్( Nishant Kumar ) కలిసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందించారు.
కొంతమంది కావాలనే ఫ్యామిలీ స్టార్ సినిమా పై చేస్తున్న దుష్ప్రచారం వల్ల ఫ్యామిలీ స్టార్ సినిమా చూడాలనుకునే ప్రేక్షకులను తప్పుదోవ పట్టిస్తున్నారని, దీంతో సినిమా వసూళ్లపై ప్రభావం పడుతోందని వారి కంప్లైంట్ లో పేర్కొన్నారు.

ఇక కంప్లైంట్ అందుంకున్న నేపథ్యంలో.ప్రాథమిక ఆధారాలు దృష్ట్యా పోలీసులు కేసు విచారించి నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు.సినిమా విషయంలో కొందరు హీరో విజయ్ మీద ద్వేషంతో ఇలా ఆయన తీసే సినిమాల మీద నెగిటివ్ సోషల్ మీడియా క్యాంపెయిన్స్ చేస్తున్నారు.
మరి ఇప్పటినుంచి అయినా సినిమాపై నెగటివ్గా ప్రచారం చేయడం ఆపేస్తారో లేదో చూడాలి మరి.అయితే విజయ్ దేవరకొండ అభిమానులు మాత్రం ఎంతమంది నెగిటివ్గా కామెంట్ చేసిన కూడా ఈ సినిమా సూపర్ హిట్ అంటూ కామెంట్ చేస్తున్నారు.







