రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని కోరుట్లపేట -సింగారం గ్రామాల మధ్యలో గల అటవీ ప్రాంతంలో వెలిసినటువంటి కోరిన కోరికలు తీర్చే శ్రీ దొంతురాల మల్లిఖార్జున స్వామి ఆలయం వద్ద మల్లన్న గుడి వద్దకు వచ్చే భక్తుల సౌకర్యార్థం నిజామాబాద్ జిల్లా జక్రన్ పల్లి మండలం పడ్కల్ కు చెందిన తోడుపునురి అమృత చేతుల మీదుగా మెట్ల నిర్మాణం కోసం భూమి పూజ చేశారు.ఈ కార్యక్రమంలో ఆమె కుమారులు తోడుపునూరి వెంకటేశం – రుక్మిణీ, తొడుపునురి శ్రీనివాస్ – సంధ్య సామ్రాట్ – నమ్రత,ఒగ్గు పూజారులు ఒగ్గు బాలరాజు యాదవ్, ఒగ్గు మహేష్ యాదవ్,నరేష్ యాదవ్,శ్రీ కృష్ణ యాదవ సంఘం నాయకులు మానుక నాగరాజు యాదవ్, బొల్లు భూమయ్య యాదవ్, పోతుల నాగ మల్లేష్ యాదవ్, వట్టెల ఆది మల్లయ్య యాదవ్, వట్టెలశేఖర్ యాదవ్, మానుక లింగం యాదవ్ బింగి దొందడి ఎల్లయ్య యాదవ్ లు పాల్గొన్నారు.
Latest Rajanna Sircilla News